మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థినులకు మహాత్మా గాంధీ జీవిత చరిత్ర పై వ్యాసరచన పోటీలు

0
238

బలగం టివి ,,రాజన్న సిరిసిల్ల

మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో
స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో
జనవరి 29 గాంధీ వర్ధంతి సందర్భంగా విద్యార్థినులకు మహాత్మా గాంధీ జీవిత చరిత్ర పై వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. మహాత్మా గాంధీ పోరాడిన తీరును విద్యార్థినులు చాలా చక్కగా రాయడం జరిగింది. ఈ వ్యాసరచన పోటీలు తెలుగు విభాగంలో విజేతలైన విద్యార్థినులకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అందజేశారు.
సృజన మొదటి బహుమతి
రెండో బహుమతి భవ్య శ్రీ
మూడో బహుమతి కె రేణుక.
ఆంగ్ల విభాగంలో
హర్షిని మొదటి బహుమతి
కార్తిక రెండవ బహుమతి గెలుచుకున్నారు.
ఈ కార్యక్రమంలో మానేరు రచయితల సంఘము ప్రధాన కార్యదర్శి ఆడేపు లక్ష్మను, ఉపాధ్యక్షులు బురదేవానందం, చిటికెన కిరణ్ కుమార్ పాఠశాల ఉపాధ్యాయులు ఎలగొండ రవి, సతీష్ బాబు నరేందర్, వెంకట్ రాములు, తిరుపతి, రాజలింగం పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here