ఎన్నికల తర్వాత కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్..
కేటీఆర్ కు మద్దతుగా శ్రీ గాధ ముదిరాజుల ఏకగ్రీవ తీర్మానం..
సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ తోని లబ్ధి పొందని కుటుంబం అంటూ ఏదీ లేదు..
కేటీఆర్ తోనే మారిన సిరిసిల్ల రూపురేఖలు…..
ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పర్శ హన్మాండ్లు
సిరిసిల్ల న్యూస్:

ఎన్నికల ప్రచారానికి కేటీఆర్ రాకున్నా బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పర్శ హన్మాండ్లు అన్నారు, తేదీ 3- 11 -2023 శుక్రవారం రోజున గంభీరావుపేట మండలం శ్రీ గాధలో జరిగిన ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా పర్శ హన్మాండ్లు హాజరైనారు, పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ
సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ తో లబ్ధి పొందని కుటుంబం గానీ వ్యక్తి గానీ లేరని సిరిసిల్ల రూపురేఖలను మార్చి సిరిసిల్ల నియోజకవర్గాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన చరిత్ర మంత్రి కేటీఆర్ కె దక్కుతుందన్నారు, ప్రత్యేక పరిస్థితులలో మంత్రి కేటీఆర్ గారికి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని శ్రీ గాద గ్రామ ముదిరాజులందరూ ఏకగ్రీవం గా తీర్మానించినట్లు పర్శ హన్మాండ్లు తెలిపారు, బిఆర్ఎస్ పార్టీ పైనే ముదిరాజులకు విశ్వాసం ఉందన్నారు, కుల మతాలకు అతీతంగా కేటీఆర్ అభివృద్ధి పనులు చేశారన్నారు, నేను గతంలో చెప్పిన మళ్లీ చెప్తున్నా ఎన్నికలు అనంతరము కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే అనీ పర్శ హన్మాండ్లు అన్నారు, అందుకు సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు గర్వపడాలన్నారు, సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రజలు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఏనలేని గౌరవం, గుర్తింపు వస్తుంది అంటే దానికి కారణము కేటీఆరే అని పర్శ హన్మాండ్లు అన్నారు, సిరిసిల్ల నియోజకవర్గంలో లబ్ధి పొందని కుటుంబం అంటూ ఏదీ లేదని ఎక్కువ లబ్ది పొందింది ప్రతిపక్ష పార్టీల కుటుంబాలు, వ్యక్తులేనన్నారు , ఈటెల రాజేందర్ తప్ప రాష్ట్రంలోని ముదిరాజు నాయకులు అందరూ బిఆర్ ఎస్ లోకీ వెళుతున్నారని అందుకు నిదర్శనమే మామిళ్ల రాజేందర్, కాసాని జ్ఞానేశ్వర్ ,బిత్తిరి సత్తి, ఎర్ర శేఖర్ ,చంద్రశేఖర్, లాంటివాళ్ళు బిఆర్ఎస్ లో చేరడమే అన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఐదు విప్లవాలను కేసీఆర్ తీసుకొచ్చారని అందులో నీలి విప్లవం వలన ముదిరాజులు మరియు మత్స్య కార్మికులు అభివృద్ధి చెందినారన్నారు, సిరిసిల్లలో కేటీఆర్ పైన పోటీ చేసే అభ్యర్థులు కేవలము నేను కేటీఆర్ పైన పోటీ చేసినా అని చెప్పుకునేందుకు మాత్రమే పని చేస్తుంది కానీ ఏ ఒక్కరికి కూడా డిపాజిట్లు దక్కవని పర్శ హన్మాండ్లు అన్నారు, ముదిరాజుల లీడర్షిప్ ను పెంచేందుకే భవిష్యత్తులో చట్టసభల్లో అడుగు పెట్టించేందుకే పేరున్న ముదిరాజ్ నాయకులను పార్టీలో చేర్చుకోవడం జరుగుతుందని పర్శ హన్మాండ్లు అన్నారు , సిరిసిల్ల నియోజకవర్గం కానీ పిట్ల భూమేష్ అనే వ్యక్తీ నేను ముదిరాజు అని చెప్పి ముదిరాజుల ఓట్లు నాకే వేయాలని మాయ మాటలుచెప్పి ముదిరాజుల మధ్యలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అటువంటి వ్యక్తి ని నమ్మవద్దు అని పర్శ హన్మాండ్లు ముదిరాజులకు పిలుపునిచ్చారు, సిరిసిల్లలో ఎమ్మెల్యేగా పోటీ చేసే శక్తి, దమ్ము నాయకత్వ లక్షణాలు నాకు లేవా అని ఈ సందర్భంగా పర్శ హన్మాండ్లు అంటూ కేటీఆర్ చేసిన అభివృద్ధి పనులకు మరియు ప్రత్యేక పరిస్థితులలో తనకు అండగా ఉండాలని చెప్పి కేటీఆర్ కు మద్దతిస్తున్నట్లు ఈ సందర్భంగా పర్శ హన్మాండ్లు తెలిపారు, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ముదిరాజులకు తప్పకుండా జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇప్పిచ్చేందుకు కేటీఆర్, కేసీఆర్లను బరాబర్ ఒప్పిస్తామన్నారు, ఈ సమావేశంలో ముదిరాజ్ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు పర్శ శ్రీనివాస్ ,ఉపాధ్యక్షులు పర్శ రవి కార్యదర్శి పర్శ చంద్రయ్య నాయకులు పర్శ నారాయణ, పర్శ పోచయ్య, పర్శ నర్సింలు , ముదిరాజ్ సంఘం మహిళ నాయకురాళ్ళు రేణుక, నరసవ్వ, ఎల్లవ్వ, రాజవ్వ, లావణ్య , సుజాత,భాగ్య, రాధా, లతా, యూత్ అధ్యక్షుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు.