బలగం టివి: రాజన్న సిరిసిల్ల:
- ఆరు గ్యారంటీలను అందరికీ అందిస్తాం..
- సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి..
ఆరు గ్యారంటీలను ఎటువంటి వర్గ విభేదం లేకుండా, తెలంగాణలోని అన్ని కుటుంబాల ప్రజలకు అందించి, వారి ముఖం లో చిరునవ్వులు చూడడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు.
ఆదివారం గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ కే కే మహేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి, తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, తెలంగాణ ప్రజల బతుకులు బాగవుతాయని భావించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని అన్నారు. వచ్చిన తెలంగాణలో పది సంవత్సరాల కాలంలో నియంతృత్వ, అరాచక పాలన కొనసాగిందని, ప్రజాస్వామిక, పౌర మరియు ప్రాథమిక హక్కులను కాల రాసారని అన్నారు. ఈ పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన కాలంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు అని, సంతోషంగా ఉన్నది ఎవరంటే రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబమే సభ్యులే అని, మరియు వారి అనుచరులు అని అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారని, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ కి అధికారం కట్టబెట్టారని అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేశామని, రానున్న వంద రోజుల్లో అన్ని గ్యారెంటీలను పూర్తిగా అమలు చేస్తామని అన్నారు. గత ప్రభుత్వం కార్యకర్తలపై ఎన్ని నిర్బంధాలు పెట్టిన, మనోధైర్యం కోల్పోకుండా కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం ప్రతి కార్యకర్త కృషి చేశారని అన్నారు. ఓడిన, గెలిచిన ప్రజలతోనే ప్రజల మధ్య ఉంటానని, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని అన్నారు. అనంతరం కేకే మహేందర్ రెడ్డి కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, క్యాబినేటిలోకి తీసుకోవాలని మండల కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు హామీద్, జిల్లా ఉపాధ్యక్షడు కోమెరిశెట్టి తిరుపతి, ఎంపిటీసి పర్శరాములు, జిల్లా సినియర్ నాయకుడు గడ్డం నర్సయ్య, నాయకులు తిరుపతి గౌడ్, బిచ్చల రాజి రెడ్డి, తిరుపతి గౌడ్, నర్సింలు, రాజ్ వీరు గంగి స్వామి,దమ్ము శ్రీనివాస్ రెడ్డి, రాజా గౌడ్, పాపగారి రాజు, తాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.