- అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఈ.జ్యోతి
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
చిన్నారులకు పండ్లు పంపిణీ వికలాంగుల సాధికారతను ప్రోత్సహిస్తూ సమాజ నిర్మాణం కోసం ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఈ. జ్యోతి అన్నారు.
జిల్లా న్యాయ సేవాధికర సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంను పురస్కరించుకొని తంగళ్లపల్లి మండలంలోని భవిత కేంద్రంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించడం జరిగింది. జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పుష్పలత ఆదేశాలతో సీనియర్ సివిల్ జడ్జి/కార్యదర్శి, DLSA పి.లక్ష్మణాచారి సమన్వయంతో ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వికలాంగుల హక్కులు, ప్రభుత్వ పథకాలు, న్యాయ సహాయం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం భవిత కేంద్రంలోని చిన్నారులకు పండ్లు మరియు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సదస్సులో తంగళ్లపల్లి ప్రైమరీ పాఠశాల హెడ్ మాస్టర్ వెంకటేశ్వర స్వామి, భవిత కేంద్రం ఐ.ఈ.ఆర్పి. కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

