బలగం టివి, రాజన్న సిరిసిల్ల
రోడ్డు నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలి
ఎస్పీ అఖల్ మహాజన్
:డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే చాల మంది వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారనీ, లైసెన్స్ లేకుండా వాహనం నడిపేవారికి రోడ్డు భద్రతపై అవగాహన సరిగా లేకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారనీ ఎస్పీ అఖల్ మహాజన్ అన్నారు.శని వారం పోలిసు శాఖ అధ్వర్యంలో సిరిసిల్ల లో నిర్వహించన లైసెన్సు మేళ కు ముఖ్యఅతిధిగా ఎస్పి అఖిల్ మహాజన్ హజరై ,రుద్రంగి మండలంలోని 50 మంది యువతి,యువకులకి లర్నింగ్ లైసెన్స్ లను అందజేశారు.ఈ సందర్బంగా ఎస్పి అఖల్ మహాజన్ మాట్లాడుతూజిల్లాలో డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉండాలనే ఉద్దేశ్యంతో దశల వారిగా గ్రామీణ ప్రాంత యువతి యువకులకు జిల్లా పోలీస్ శాఖ, రోడ్ రవాణా శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మెళ నిర్వహించి వారికి లైసెన్స్ అందజేస్తున్నమని అన్నారు.లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాల భారిన పడినప్పుడు వారికి వచ్చే వారికి వచ్చే ప్రమాద భీమా వర్తించదు అన్నారు.జిల్లాలో డ్రైవింగ్ వచ్చిన వారికి లైసెన్స్ ఉండాలనే ఉద్దేశ్యంతో దశల వారిగా గ్రామీణ ప్రాంత యువతి యువకులకు జిల్లా పోలీస్ శాఖ మరియు జిల్లా రోడ్ రవాణా శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మెళ నిర్వహించి లైసెన్స్ లు అందజేయడం జరుగుతుందన్నారు.
మొదటి దశలలో రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో లైసెన్స్ మెళపై అవగాహన కల్పించగా 50 దరఖాస్తులు రావడం జరిగిందని,వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఆన్లైన్ టెస్ట్ కి సబధించిన పరీక్ష పై అవగాహన కల్పించి, వారితో నిర్ణిత రుసుముతో ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేపించి,ఆర్టీవో కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్స్ కి లర్నింగ్ టెస్ట్ సంబంధించిన పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత పొందిన 50 మందికి లర్నింగ్ లైసెన్స్ కు అందజేయడం జరిగిందని, వీరికి త్వరలో డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి డ్రైవింగ్ లైసెన్స్ లు అందజేయడం జరుగుతున్నదనీ అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు ఉదయ్ రెడ్డి, నాగేంద్రచరి, సిఐ కిరణ్ కుమార్,ఎంవీఐ కిషోర్,ఎస్ఐ అశోక్ సిబ్బంది, యువతి యువకులు పాల్గొన్నారు