బలగం టివి ,సిరిసిల్ల
ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించగలం:సిరిసిల్ల టౌన్ సి.ఐ రఘుపతి.
జిల్లాలో విద్యార్థిని,విద్యార్థిని విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, సిగ్నల్స్ మీద అవగాహన కల్పించడమే లక్ష్యంగా రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలోని మహర్షి పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ లో భాగంగా ట్రాఫిక్ రూల్స్,ట్రాఫిక్ సిగ్నల్స్, సైన్ బోర్డ్స్,MV act,హెల్మెట్, వాహనాల చట్టాలు, మొదలగు అంశాల మీద ట్రాఫిక్ ఎస్.ఐ రాజు ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరిగింది.
ఈ సందర్భంగా సిరిసిల్ల టౌన్ సి.ఐ మాట్లాడుతూ…
విద్యార్థి దశ నుండే ట్రాఫిక్ నియమాల మీద ,ట్రాఫిక్ సిగ్నల్స్ మీద అవగాహన ఉండాలని తద్వారా రోడ్ ప్రమాదాలను నియంత్రించ వచ్చు అనే ఆలోచనలో జిల్లా ఎస్పీ రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ అనే కార్యక్రమం ద్వారా జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులకు వాహనాల చట్టాలపై, ట్రాఫిక్ నియమలపై అవగాహన కల్పించడం జరుగుతున్నారు.
విద్యార్థిని విద్యార్థులు హెల్మెట్ వినియెగం, ట్రాఫిక్ నియమాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ పై తల్లిదండ్రులకు,బంధువులకు స్నేహితులకు,తోటి వారికి అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సేఫర్ ఇండియన్ రోడ్,ఇండియన్ యూత్ సెక్యూర్ ఆర్గనైజేషన్ అనే ఎన్జీవో ఓఝా,మహర్షి పాఠశాల సిబ్బంది పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
