- ఇల్లంతకుంట సర్పంచ్ యం. రాజు
బలగం టీవీ, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట గ్రామ పంచాయతీ అభివృద్ధి లో ప్రతి మహిళ భాగస్వామ్యం కావాలని ఇల్లంతకుంట సర్పంచ్ యం. రాజు కోరారు.మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహిళల ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభ ఘనంగా నిర్వహించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన సర్పంచ్ యం. రాజు మాట్లాడుతూ, మహిళలు గ్రామాభివృద్ధిలో భాగస్వాములు మాత్రమే కాకుండా మార్పుకు మార్గదర్శకులని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించి, ప్రతి అర్హుడికి వాటి లబ్ధి చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే కుట్టు యంత్ర శిక్షణ, పశుపోషణ, చిన్నతరహా వ్యాపారాలు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఉపాధి హామీ పనులు వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది. ప్రతి మహిళ కనీసం ఒక ఉపాధి మార్గాన్ని ఎంచుకుని ఆదాయం పెంపొందించుకోవాలని కోరారు. గ్రామసభలో తాగునీరు, పారిశుధ్యం, వీధిదీపాలు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యా మరియు ఆరోగ్య సదుపాయాల మెరుగుదలపై విస్తృత చర్చ జరిగింది. మహిళలు తమ సమస్యలను, సూచనలను ధైర్యంగా వెల్లడిస్తూ గ్రామాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శశికళ, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, జిపిఓ కవిత, ఏఎన్ఎం సుహాసిని, ఎస్‌జిహెచ్ ఆడిట్ సీఆర్పీ మౌనిక, ఉపసర్పంచ్ మూగు నాగరాజు శర్మ, వార్డు సభ్యులు దయ్యల శ్రీలత, రేగుల కార్తీక్, ఎర్రోజు దీపిక, మామిడి సుశీల, మామిడి శ్రీనివాస్, చేరాల వంశీకృష్ణ, రాకం సుమన్, కొట్టే ప్రమీల, అంతటి శ్రీకాంత్, కునబోయిన ఎల్లవ్వ, కునబోయిన రఘు, మహిళ సంఘాల నాయకులు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
