ఓటుపై ప్రతి ఒక్కరు అవగాహన పెంపొందించుకోవాలి”*

0
116

(ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం)

బలగం టీవి, , ఎల్లారెడ్డిపేట

18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, ఓటుపై ప్రతి ఒక్కరు అవగాహన పెంపొందించుకోవాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ క్యాతం సత్యనారాయణ అన్నారు. గురువారం రోజున యెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ ఓటరు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఓటు ప్రాధాన్యతపై ప్రధాన రహదారిపై ర్యాలీ తీస్తూ నినాదాలు ఇచ్చారు.అనంతరం కళాశాలలో ఓటరు ప్రతిజ్ఞ చేసి ఓటు విలువపై అవగాహన కల్పించారు.రాజనీతి శాస్త్ర అధ్యాపకులు మాదాసు చంద్రమౌళి మాట్లాడుతూ యువత ముందుకు వచ్చి ఓటును నమోదు చేసుకోవాలని, అలాగే వినియోగించుకోవాలని, దేశాభివృద్ధిలో యువత పాత్ర ఎంతో అవసరం ఉందని, రాజకీయాల్లోకి రావాలని, భ్రష్టు పట్టిన రాజకీయాలను మార్చే శక్తి నేటి యువతరానికే ఉందనీ అన్నారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ క్యాతం సత్యనారాయణ, జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ అధికారి వాసరవేణి పర్శరాములు, లెక్షరర్స్ మాదాసు చంద్రమౌళి,చెరుకు భూమక్క, నీరటి విష్ణు ప్రసాద్, బుట్ట కవిత, ఆర్.గీత, చిలుక ప్రవళిక, కొడిముంజ సాగర్, అగోలం గౌతమి, బోధనేతర సిబ్బంది విమల్ కుమార్, కె.దేవేందర్, ఎం.డి తాజోద్దిన్, రజిత మరియు లక్ష్మీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here