–జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “డి-ఆడిక్షన్” ఏర్పాటు.
–ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్
బలగం టివి, సిరిసిల్ల:
మాధకద్రవ్యాల నిర్మూలన కోసం , ఇతర రాష్ట్రాలలో లేని విధంగా ఎంతో సాహాసోపేత నిర్ణయలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ లోని బస్తి దవాఖానలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “డి-ఆడిక్షన్” సెంటర్ ను ఎస్పీ అఖిల్ మహాజన్ కలసి ,ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ప్రారంభించారు.సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత గంజాయి, మత్తుపదార్థాల బారిన పడకుండా రాష్టంలో పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గంజాయి, డ్రగ్స్ మత్తు పదార్థాల నియంత్రణ అందరూ సామాజిక బాధ్యతగా భావించాలన్నారు.మాదక ద్రవ్యాల ప్రభావంతో యువత మత్తుకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, యువత పురోగతికి అవరోధంగా నిలుస్తున్న గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను నియంత్రించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి ప్రతీ ఒక్కరు మాధకద్రవ్యాల నియంత్రణలో భాగస్వాములు కావాలని అన్నారు.మాధకద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్న వారిని సన్మార్గంలో నడిపించేందుక ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక చొరవతో జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ లోని బస్తి దవాఖానలో ఆపరేషన్ విముక్తి పేరుతో “డి-ఆడిక్షన్” సెంటర్ కి శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ..సత్ప్రవర్తన కలిగిన పౌరులే రేపటి భవిష్యత్తు కి పునాది అని అలాంటి పౌరులు మాధకద్రవ్యాలకు బానిసలు కాకుండా కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందిన్నారు. జిల్లాలో గంజాయి ,మాధకద్రవ్యాల నిర్ములనకు ప్రత్యేక చర్యలు తీసుకోవడతో పాటుగా మాధకద్రవ్యాల వలన కలుగు అనార్ధాల గురించి జిల్లాలో యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేసి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించాడాం జరుగుతున్నదనీ అన్నారు.మాధకద్రవ్యాలకు అలవాటు పడిన వారిని సన్మార్గంలో నడిపించేందుకు ,డి-అడిక్షన్ సెంటర్ ఏర్పటు చేసి సైకలజిస్ట్,సైకియాట్రిస్ట్ డాక్టర్స్ తో కౌన్సెలింగ్ తో పాటుగా వైద్య సదుపాయాలు అందజేయం జరుగుతున్నారు.డి-అడిక్షన్ సెంటర్ లో కౌన్సెలింగ్ కొరకు పెరు నమోదు మరియు ఇతర సమాచారం కోసం మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించాలని అన్నారు.గంజాయి, మత్తు పదార్థాలు కి సంబంధించిన సమాచారం మెసేజ్ యువర్ ఎస్పీ వాట్సప్ నెంబర్ 6303 922 572 కి సమాచారం అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ ఉదయ్ రెడ్డి,ఇంచార్జ్ డిఎంహెచ్వో రజిత, సిరిసిల్ల ప్రభుత్వ సూపరింటెండెంట్ చికోటి సంతోష్ సైక్రియాటిస్టులు డా.ప్రవీణ్ కుమార్ , డా.సతీష్,కౌన్సిలర్ పూర్ణచందర్ ,సిఐ రఘుపతి, సిబ్బంది పాల్గొన్నారు.

