జీపీ రెండో ఫేజ్ ఎన్నికలకు సర్వం సిద్దం..

0
70

ఇల్లంతకుంట, బోయినపల్లి, తంగళ్ళపల్లి మండలాల్లోని 77 జీపీలు, 530 వార్డుల్లో ఎన్నికలు

18 రకాల గుర్తింపు కార్డులతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండో ఫేజ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. ఈ నెల 14 వ తేదీన ఆదివారం 77 గ్రామ పంచాయతీలు, 530 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్దమైంది.

మొత్తం ఓటర్లు 1,11,130 మంది

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్ళపల్లి మండలాల్లో రెండో ఫేజ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. బోయినపల్లి మండలంలో 14,753 మంది పురుషులు, 15,752 మహిళలు మొత్తం 30,505, ఇల్లంతకుంట మండలంలో 19,644 మంది పురుషులు, 20,902 మహిళలు మొత్తం 40,546, తంగళ్ళపల్లి మండలంలో 19,395 మంది పురుషులు 20,683 మహిళలు, ఇతరులు ఒకరు మొత్తం 40,079 ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లు 1,11,130 మంది ఉన్నారు.

మొత్తం పోలింగ్ కేంద్రాలు

బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్ళపల్లి మండలాల్లో మొత్తం గ్రామ పంచాయతీలు 88, వార్డు స్థానాలు 758 ఉండగా, 11 సర్పంచ్ స్థానాలు, 228 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ నెల 14 వ తేదీన ఆదివారం 77 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు, 530 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్ స్థానాలకు అభ్యర్థులు 279, వార్డు స్థానాలకు అభ్యర్థులు 1,296 మంది పోటీలో ఉన్నారు.

ప్రణాళిక సిద్ధం

ఎన్నికలకు మూడు మండలాల్లో కలిపి మొత్తం ప్రిసైడింగ్ అధికారులు 910, అదర్ పోలింగ్ అధికారులు 1093 మంది విధులు నిర్వర్తించనున్నారు. ఎన్నికల సామగ్రి, అధికారులు, సిబ్బందిని తరలించేదుకు బోయినపల్లి మండలంలో మొత్తం జోన్స్ 4, రూట్స్ 8, ఇల్లంతకుంట మండలంలో జోన్స్ 5, రూట్స్ 8, తంగళ్ళపల్లి మండలంలో జోన్స్ 5, రూట్స్ 10 గా ప్రణాళిక సిద్ధం చేశారు. మూడు మండలాల్లో కలిపి మొత్తం 530 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు.

ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు జాబితాలో పేరుండి … ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) కాకుండా ఈ కింద చూపిన 18 ప్రత్యామ్నాయ ఫొటో ఐడీలలో దేనినైనా ఒకటి పోలింగ్ సిబ్బందికి చూపి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

ఆధార్, భారతీయ పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్ యూలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు, బ్యాంకు, తపాలా కార్యాలయం జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్ బుక్, పాన్ కార్డు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్ఏఐ) కింద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఇండియా(RGI) జారీ చేసిన స్మార్ట్ కార్డు, శాసనసభ, శాసనమండలి జారీ చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అధికారిక గుర్తింపు కార్డులు, ఫాటోతో కూడిన స్వాతంత్ర్య సమరయోధుల గుర్తింపు కార్డు, లోక్ సభ, రాజ్యసభ జారీ చేసిన ఎంపీ గుర్తింపు కార్డు, ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు జారీ చేసిన ఫాటోలతో కూడిన ఉపాధి హామీ జాబ్ కార్డు, కేంద్ర కార్మికశాఖ జారీచేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్, రేషన్ కార్డు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ధ్రువపత్రాలు, పెన్షన్ పత్రాలు, ఆయుధాల లైసెన్స్, దివ్యాంగ ధృవీకరణ పత్రం, పట్టాదారు పాస్ బుక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here