గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి
ఎన్నికల సామాగ్రి సెంటర్ ను పరిశీలించిన ఎస్పీ మహేష్ బి గీతే
బలగం టీవీ, బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ నుంచి ఎన్నికల సామాగ్రి పంపిణి కార్యక్రమం బోయినిపల్లి మండలంలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఆదివారం రోజున జరగనున్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలంలోని 23 గ్రామపంచాయతీలు ఉండగా, మండలంలో మొత్తం 35505 ఓటర్లు ఉన్నారు.పురుషులు 14,753, మహిళలు 15,752 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మండలంలో 23 గ్రామపంచాయతీలకు గాను పోటీ చేసే అభ్యర్థులు మొత్తం 90 సర్పంచ్ అభ్యర్థులు పోటీలలో నిలిచారు.గ్రామపంచాయతీ ఎన్నికల సందర్బంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేసిన పోలీసులు అధికారులు.
గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పగడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు. పోలీసులు, ఎన్నికల సామాగ్రి సెంటర్ ను ఎస్పీ మహేష్ బి గీతే మండలంలో పరిశీలించారు.
బోయినిపల్లి మండలంలో సెకండ్ ఆర్డినరీ విడత ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన అధికారులు. మండలంలో 212 పోలి కేంద్రాలు ఉండగా పిఓలు, ఏపీవోలు 457 మంది, ఆర్ ఓలు 23 మంది, జోనల్ ఆఫీసర్లు నలుగురు, రూట్ ఆఫీసర్లు 8 మంది పని అయినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఒక డిఎస్పి, ముగ్గురు సీఐలు, 12 మంది ఎస్ఐలతో పాటు 200 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎన్నికల సామాగ్రి పంపిన వద్ద ఆర్డిఓ రాధాబాయి, ఎంపీడీవో జయశీల ఎప్పటికప్పుడు సూచనలు చేశారు.








