బలగం టివి, తంగళ్లపల్లి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మానేరు నది ఒడ్డున గల గంగమ్మ ఆలయంలో గంగాభవాని ఉత్సవ విగ్రహాల కోసం 50 వేల రూపాయలను గంగపుత్రులకు అందజేసిన మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య.గంగమ్మ తల్లి పై ఉన్న భక్తితో గంగపుత్ర సంఘ సభ్యుల కోరిక మేరకు గంగమ్మ తల్లి ఉత్సవ విగ్రహాల కోసం అందజేశానని తెలిపారు.తాను
గంగమ్మ తల్లి దీవెనలతో జెడ్పిటిసి,సర్పంచి హయాంలో విజయవంతమయ్యాయని అన్నారు.గంగపుత్ర కమిటీ సభ్యులు మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షులు ఇటికల రాజనర్సు,ప్రధానకార్యదర్శి ఇటికల మల్లేశం,కోశాధికారి ఇటికల దేవరాజు,మాజీ అధ్యక్షులు ఇటికల మహేందర్,సంఘ సభ్యులు ఇటికలరాజనర్సు,అశోక్,రమేష్,బాలకిషన్,శ్రీనివాస్,రవి, శంకర్,చిన్న మహేందర్ తదితరులు పాల్గొన్నారు.