బలగం టివి, ప్రతినిధి:ఇల్లంతకుంట
ఇల్లంతకుంట మండలం
పోత్తూరు గ్రామంలో శనివారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన అభయ హస్తం కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పి వైస్ చైర్మన్ సిద్దం వేణు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం, అధికారులు అభయహస్తం కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి ప్రజలకు అండగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్ డి ఓ ఆనందర్ కుమార్
, గ్రామ సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్ ,ఎంపీటీసీ పట్నం అశ్విని శ్రీనివాస్, ఉపసర్పంచ్ పరుశురాం గౌడ్ గ్రామపంచాయతీ పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు