- ఎస్పీ మహేష్ బి.గితే
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ప్రతిరోజు ఉదయాన్నే కనీసం ఒక అరగంట వ్యాయామం,నడక ఏదో ఒకటి చేయాలని,సాధ్యమైనంత వరకు బయట ఆహారం తినడం మానివేయాలని ఎస్పీ మహేష్ బి.గితే అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ అవరణలోని పరేడ్ మైదానంలో జిల్లా ఆర్మూడ్ రిజర్వ్ ,సివిల్ పోలీస్ సిబ్బంది,హోమ్ గార్డ్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించగా, ఈ పరేడ్ కి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే హాజరై గౌరవ వందనం స్వీకరించరు..అనంతరం సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్, సిబ్బంది ప్రదర్శనని పరిశీలించారు.
ఈ సందర్బంగా ఎస్పీ మహేష్ బి.గితే మాట్లాడుతూ, రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేసుకోవాలని,వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి క్రమశిక్షణ,యూనిటీగా ఉండడం, ఫిజికల్ ఫిట్నెస్ కిఉపయోగపడుతుందన్నారు.క్రమశిక్షణతో డ్యూటీలు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందేలాగా పనిచేస్తూ పోలీస్ శాఖకి, జిల్లాకి మంచి పేరు తెచ్చేలాగా పని చేయాలని అన్నారు.సిబ్బందికి ఏదైనా సమస్య వుంటే ఎప్పుడైనా తనను కలుసుకొని తమ సమస్యను తెలియజేసుకోవచ్చని అన్నారు.
ఈ పరేడ్ లో అదనపు ఎస్పీ చంద్రయ్య,ఆర్ఐ లు రమేష్, మధుకర్, యాదగిరి,సిఐ లు కృష్ణ, మొగిలి, మధుకర్, ఎస్ఐ లు కిరణ్ కుమార్, వినిత రెడ్డి, జునైద్, శ్రవణ్ యాదవ్,ఆర్ముడ్ సిబ్బంది, సివిల్ సిబ్బంది,హోమ్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.







