కస్బె కట్కూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గానికి సత్కారం
బలగం టివి: తంగళ్లపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కస్టె కట్కూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గానికి, పంచాయతీ సిబ్బందికి సర్పంచ్ వలకొండ వేణుగోపాల్ రావు గురువారం ఘన సత్కారం చేశారు. ఫిభ్రవరి ఒకటవ తేదికి గ్రామపంచాయతీ పాలకవర్గం పదవి కాలం ముగియడంతో గ్రామంలో గ్రామ కార్యదర్శికి, అగ్రికల్చర్ ఏఈవో కు, వార్డు మెంబర్లకు, పారిశుధ్య కార్మికులకు, అంగన్‌వాడి టీచర్, ఆశా వర్కర్, స్వశక్తి మహిళ ప్రతినిధులకు తంగళ్లపల్లి మండలం ఫోరం అధ్యక్షులు, కస్బె కట్కూర్ సర్పంచ్ వలకొండ వేణుగోపాల్ రావు సత్కరించారు. ఐదేళ్లు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన కస్బె కట్కూర్ గ్రామప్రజలకు వేణుగోపాల్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తాను గ్రామానికి సేవ చేశానని, పాలకవర్గం సభ్యులు బాగా పని చేశారన్నారు. భౌవిష్యత్ లో కూడా ప్రజా సేవాలో ఉంటానని, పదవులు ఉన్న లేకున్న కస్బె కట్కూర్ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు.
