ఎఫ్-16 వింగ్స్ ఉత్పత్తి: భారత్‌లో టాటా-లాక్‌హీడ్ భాగస్వామ్యం బలోపేతం..

0
9

బలగం టీవీ, హైదరాబాద్:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఎయిరోస్ట్రక్చర్స్ సంస్థ సీఓఓ, మేనేజింగ్ డైరెక్టర్ టిమ్ రైఫిల్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ భారతదేశంలో సీ-130జె సూపర్ హెర్క్యులిస్ ఫైనల్ అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేయనుంది. అంతర్జాతీయ అవసరాల కోసం భారతదేశంలో లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ తో కలిసి సంయుక్తంగా F-16 వింగ్స్ ఉత్పత్తి చేసేందుకు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. రక్షణ రంగంలో ఎయిర్‌క్రాఫ్ట్ ఎంఆర్ఓ (ఎంఆర్ఓ) ఫెసిలిటీతో పాటు ఇతర డిఫెన్స్ హబ్‌గా విస్తరిస్తున్న నేపథ్యంలో, తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ఉన్నట్లు ఈ సందర్భంగా టిమ్ రైఫిల్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here