బలగం టీవీ, సూర్యాపేట :
సూర్యాపేట జిల్లా మఠంపల్లికి చెందిన బత్తుల శ్రీనివాస్ అనే వ్యక్తి డీఎస్పీగా చలామణి అవుతూ, పోలీసు, పౌరసరఫరాల శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని యువత నుండి భారీగా డబ్బులు వసూలు చేశాడు. కోదాడకి చెందిన యువతికి ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.36 లక్షలు, కానిస్టేబుల్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువత నుండి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేశాడు. సూర్యాపేట పట్టణంలోని శ్రీ గ్రాండ్ హోటల్ యాజమాన్యం తమ హోటల్లో అనుమానాస్పద వ్యకి ఉన్నట్టు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు.