బలగం టీవి:, బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుల వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో పాఠశాలలో పని చేసి బదిలీపై వెల్లిన ప్రధానోపాధ్యాయులు ఎం.ప్రేమలత మరియు భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు గసికంటి శ్రీనివాస్ లకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూమయ్య, మండల విద్యాధికారి శ్రీనివాస్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బొల్గం శ్రీనివాస్, జెలందర్, అల్తాఫ్ అహ్మద్, ఉపాధ్యాయులు నర్సింహారెడ్డి, శ్రీనివాస్ రావు, సత్యనారాయణ, తదితర ఉపాధ్యాయబృందం మరియు సంఘ నాయకులు, ఎం.ఆర్.సి సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.