- ప్రభుత్వం ఆదుకోవాలని బంధువుల విజ్ఞప్తి.
బలగం టివి, ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గన్నేవారిపల్లె గ్రామం నిమ్మవారిపల్లె కాలనీలో నిమ్మల ప్రభాకర్ వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ షాక్ తో మృతి చెందదారు.స్థానికుల వివరాల ప్రకారం ఉదయాన్నే పొలం ఒడ్లపై గడ్డి కోయడానికి వెళ్లి విద్యుత్ షాక్ తో మరణించడం బాధాకరమన్నారు.విద్యుత్ స్తంభం సపోర్ట్ వైరుకు విద్యుత్ సరఫరా కావడం చేత గడ్డి కోస్తూ సపోర్ట్ వైర్ ను ప్రమాదవశాత్తు తగలడంతో షాక్ కు గురై అక్కడికక్కడే మరణించాడని తెలిపారు.సమాచారం అందుకున్న ఎస్ఐ శేఖర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.ప్రభాకర్ మరణం పట్ల గ్రామస్తులు కంటతడి పెట్టారు.మృతునికి తండ్రి లింగయ్య తల్లి దేవవ్వ భార్య లక్ష్మి ఒక సంవత్సరం పాప ఉన్నారు.ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.