స్వంత ఖర్చులతో ఆయకట్టు కాలువలో పూడికతీత..
-నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు
బలగం టీవి , గంభీరావుపేట :
మానేరు నుండి వచ్చే ప్రతి నీటి బొట్టు యాసంగి పంటలకు పూర్తి స్థాయిలో సద్వినియోగం కావాలన్న ఉద్దేశ్యంలో పూడిక తీత పనులు చేపడుతున్నామనీ, దీంతో రైతుల రంది లేకుండా సాగు చేసుకోవచ్చని నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు అన్నారు.శుక్రవారం గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు ఎడమ కాలువ పూడికతీత పనులను స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులతో కొండూరి రవీందర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కొండూరి రవీందర్ రావు మాట్లాడుతూ
నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు ద్వార ఎడమ కాలువ కింద ఆయకట్టు భూములలో చివరి వరకు యాసంగి పంటలు పండాలన్న ఉద్దేశ్యంతో పూడిక తీత పనులు చేపడుతున్నామని అన్నారు. గత నాలుగేళ్లుగా ప్రతి ఏడాది ఎడమ కాలువలో పేరుకుపోయిన చెత్త, పూడిక తీతను స్వంత ఖర్చులతో శుబ్రంగా చేపిస్తున్నానని,మరో రెండు రోజుల్లో పూడిక తీత పనులు పూర్తి కావడంతో ఆయకట్టు రైతులు సాగును ప్రారంభించుకోవచ్చని అన్నారు. అనంతరం మండల కేంద్రంలో సహకార బ్యాంకు ద్వార రుణం పొందిన కొంకటి దేవేందర్, అంబటి సాగర్ లబ్దిదారులకు రెండు స్విఫ్ట్ కారులను రవీందర్ రావు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎడబోయిన రాజు, సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు, బ్యాంక్ మేనేజర్ శ్రీనివాన్రెడ్డి, సీఈఓ రాజిరెడ్డి, నేతలు వంగ సురేందర్ రెడ్డి,రాజేందర్, వెంకటి, కిషోర్, అంజనేయులు, ఆయకట్టు రైతులు తదితరులు పాల్గొన్నారు.