యూరియా కోసం రైతుల నరకం..

0
53

కాంగ్రెస్ దుర్మార్గ పాలన రైతుల పాలిట శాపంగా మారింది..

రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలతో రైతులు నరకం చూస్తున్నారు..

  • మాజీ మంత్రి హరీష్ రావు

బలగం టీవీ, హైదరాబాద్‍:

తెలంగాణలో యూరియా కొరతపై కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు, క్యూ లైన్ల సమస్యపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలను తప్పుబట్టారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్ననే పర్యటించిన నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలం, ధర్మరావు పేట గ్రామంలో యూరియా కోసం రైతులు పడుతున్న అగచాట్లను హరీష్ రావు ప్రస్తావించారు. రైతులకు యూరియా సరఫరా చేయడం చేతగాని రేవంత్ రెడ్డి, నిన్న ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిండు. విజయోత్సవాల పేరిట ప్రభుత్వ ధనం దుబారా చేస్తూ.. చేసింది లేక, చెప్పుకునేది లేక గప్పాలు కొట్టిండని హరీష్ రావు ఘాటుగా విమర్శించారు.

గ్లోబల్ సమ్మిట్, విజన్ 2047 అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న రేవంత్ రెడ్డి, ముందు రైతులకు యూరియా సరఫరాపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ ప్రణాళికను గాలికి వదిలేయడం వల్లే రైతులు, మహిళలు, వృద్ధులు సైతం యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడే దుస్థితి ఏర్పడిందని హరీష్ రావు ఆరోపించారు. మీ దుర్మార్గ పాలన రైతుల పాలిట శాపంగా మారింది. మీ రైతు వ్యతిరేక విధానాలతో రైతులు నరకం చూస్తున్నారని అన్నారు.

గత సీజన్‌లో ఎదురైన యూరియా కష్టాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ నేర్చుకోకపోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. సీజన్ ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే, మున్ముందు ఇది మరింత దారుణంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా కొరత రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, తక్షణమే రైతులకు సరిపడా యూరియాను అందుబాటులోకి తేవాలని బీఆర్ఎస్ తరపున హరీష్ రావు డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here