భూభారతి చట్టంతో రైతులకి ఎంతో మేలు

0
21

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

– భూ సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యం

  • కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

అన్ని అర్హతలు ఉండి భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి భూభారతి చట్టంతో ఎంతో మేలు చేకూరుతుందని,అర్హులందరూ చట్టాన్నిసద్వినియోగం చేసుకొని హక్కులను పొందాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ భారతి (రికార్డు ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్)  చట్టం 2025పై అవగాహన సదస్సును ముస్తాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించగా, ముఖ్యఅతిథిగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ భారతి అమల్లోకి వచ్చిందని, ముందుగా రాష్ట్రంలోని 4 మండలాలలో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ చట్టం అమలు చేస్తున్నారని అన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.

ప్రస్తుతం ధరణి లో ఉన్న భూ రికార్డులు భూ భారతి  చట్టంలో కొనసాగుతాయని,భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అర్హులైన వారు జిల్లాలో నూతన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.ఆ దరఖాస్తులను పరిశీలించి రెవెన్యూ డివిజన్ అధికారి,  కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకుంటారని, దరఖాస్తుదారునికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే  కలెక్టర్, భూమి ట్రిబ్యూనల్ లో అప్పీల్ చేసుకోవచ్చనిఅన్నారు.

భూ సమస్యలు హద్దుల సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన చట్టంలో జియో ట్యాగింగ్ తో,అలాగే మ్యాప్ తో పాస్ పుస్తకాలను జారీ చేయనుందని అన్నారు. దీంతో రైతులకు దారి సమస్య ఇతర ఇబ్బందులు ఎదురుకావని అన్నారు. ఇక్కడ ఆర్డీఓ రాధాభాయి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తలారి రాణి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, తహశీల్దార్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here