బలగం టివి: ఎల్లారెడ్డిపేట
జాతీయ అవార్డు అందుకున్న ఇద్దరినీ ఫ్యాక్స్ చైర్మన్ శాలువా కప్పి సన్మానించారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శ్యామంతుల అనిల్,దుంపెన రమేష్ లకు ఈ నెల 10న విజయవాడలో తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్ఛంద సంస్థ వారు కళా రత్న అవార్డు,ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ అవార్డులను అందుకోగా వారిని బుధవారం రోజు ఫాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఆయన కార్యాలయంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బండారి బాల్రెడ్డి,నేవూరి వెంకట నరసింహారెడ్డి, వార్డు సభ్యుడు బందారపు బాల్రెడ్డి, మిత్ర యూత్ అధ్యక్షుడు గుండెల్ని సామి గౌడ్,మండల యాదవ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, సర్వయ్య గారి పద్మా రెడ్డి పాల్గొన్నారు.