బలగం టివి, రాజన్న సిరిసిల్ల :
– వేములవాడ పాలకమండలిలో ఒక గిరిజన అభ్యర్థికి అవకాశం కల్పించాలి
–లంబాడీల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు నరేష్ నాయక్
గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్బంగా ఫిబ్రవరి 15నాడు సెలవు రోజుగా ప్రకటించాలని లంబాడీల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నరేష్ నాయక్ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.గురువారం సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ దేశంలో సుమారు 3 కోట్ల పై గా, రాష్ట్రంలో సుమారు 35 లక్షల గిరిజనులు ఉన్నారని అన్నారు. గత ప్రభుత్వం జయంతి సందర్భంగా నియోజకవర్గాలుగా కేటాయించిన నిధులు చాలా తక్కువ అని,సిరిసిల్ల జిల్లా కి 73,000 వేల నిధుల మాత్రమే కేటాయించారనీ అన్నారు. కోత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి లక్ష రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులలో గిరిజనులు అధిక శాతం ఉన్నారనీ, పాలకమండలిలో ఒక గిరిజన అభ్యర్థికి అవకాశం కల్పించాలనీ అన్నారు.ఉమ్మడి ఖమ్మం, వరంగల్ ,నల్గొండ మరియు మహబూబ్ నగర్ నుండి దూర ప్రాంతాల వచ్చే భక్తులు సరైన వసతులు లేక ఇబ్బందు లు పడుతున్నారనీ , ప్రభుత్వం భక్తులకు వసతి భవనం ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మోహన్ నాయక్, రమేష్ నాయక్, రాజేష్ నాయక్, గంగాధర్ నాయక్, నవీన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు