శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సినీ నటుడు సుమన్

0
102

బలగం టివి, వేములవాడ

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు సుమన్ సోమవారం నాడు దర్శించుకున్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ప్రత్యేక పూజలలో పాల్గొన్న అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం గావించారు. ఆలయ ఏఈఓ బ్రాహ్మణ శ్రీనివాస్ శ్రీ స్వామివారి ప్రసాదం అందజేశారు. ఆలయ ప్రోటోకాల్ సూపర్ ఇంటెండెంట్ సిరిగిరి శ్రీరాములు ఉన్నారు.

మహిమగల పుణ్యక్షేత్రం వేములవాడ

  • సినీ నటుడు సుమన్
    వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం అత్యంత మహిమగల పుణ్యక్షేత్రమని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. సోమవారం నాడు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు అత్యంత మహిమ కలిగిన దేవుడని అందుకే ప్రతినిత్యం వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనం కోసం వస్తున్నారని అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కోరుకున్నానని సుమన్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here