సిరిసిల్ల సెస్​ లో అగ్ని ప్రమాదం..! కీలక ఫైళ్లు ధగ్ధం?

0
230

సెస్​ యాబై ఏళ్ల చరిత్రలో మొదటి అగ్నిప్రమాదం

దీపావళీ రోజు.. ఒకే ఫర్చెస్​ సెక్షన్​ లో అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదామా….? కుట్ర కోణమా..?

విచారణ జరుపుతున్న పోలీసులు.. సీసీ పుటేజ్​ డీవీఆర్​ స్వాధీనం

బలగం టివి న్యూస్​:

రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకమైన సహకార విద్యుత్​ సరఫరా సంస్థ(సెస్​) లో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెస్​ సంస్థ ఏర్పాటు ఐన 50 ఏండ్ల చరిత్రలో మొదటిసారి అగ్ని ప్రమాదం చోటు చేసకుంది. టఫాసులు కొడితే నిప్పు రవ్వలు పడి అగ్ని ప్రమాదం జరిగి ఉండోచ్చు అని సెస్​ అధికారులు పేర్కొంటుండగా సిరిసిల్ల లో చర్చపచర్చలు కొనసాగుతున్నాయి. సెస్​ లో అన్ని సెక్షన్ల కిటికిలు మూసి ఉంటే కీలకమైన సెక్షన్​ పర్చెస్​ సెక్షన్​ గదికి సంబంధించిన కిటికిలు మాత్రమే తీసి ఉన్నాయని సమాచారం. టఫాసులు కొడితే ఫై ఫ్లోర్​ లో ఉన్న కీలక సెక్షన్​(ఫర్చెస్ సెక్షన్​) లో కేవలం ఒకే సెక్షన్​ లో అగ్ని ప్రమాదం ఎలా జరుగుతుందని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెస్​ చైర్మన్ గా​ చిక్కాల రామారావు, ప్రస్తుత పవర్​ లూం అండ్​ టెక్స్​టైల్​ కార్పోరేషన్​ చైర్మన్ గతంలో సెస్​​ వైస్​ చైర్మన్​ గా గూడూరి ప్రవీణ్​ పదవి బాధ్యతలు చేపట్టిన కాలంలో పలు అవినీతి అరోపణలు ఎదుర్కోన్నారు. ఆ కేసు ఇప్పటికి వెంటాడుతుంది. నాలుగు నెలల కిందనే విజిలెన్స్​ అధికారులు పలు నోటీసులు జారీ చేశారు. 51 ఎంక్సైరీ కింద సెస్​ అక్రమాలపై విచారణ కొనసాగుతుంది. తాజాగా విజిలెన్స్​ అధికారులు పర్చెస్​ సెక్షన్​కు సంబందించిన 1‌‌ ఎప్రిల్​ 2007 నుంచి 31మార్చీ 2011 వరకు పర్చెస్​ సెక్షన్​ లో జరిగిన లావాదేవిలు.. వర్క్​ ఎస్టీమేట్లు, టెండర్​ వర్క్, మెటిరియల్​ కొనుగోళ్లు, స్టాక్​ రిజిష్టర్లు బిల్లులు, చెక్​ మేజర్​మెంట్​ బుక్స్​, మెటిరియల్​ పర్చెస్​ అర్డర్స్​, ఆసమయలో పని చేసిన అధికారుల వివరాలు.. లావాదేవీలు, కొనుగోళ్ల వివరాలు.. ఆడిట్​ వివరాలు పూర్తి స్థాయి లో అందించాలని సెస్​ కు విజిలెన్స్​ శాఖ నోటీసులు జారీ చేసింది. నోటీసులిచ్చిన సెస్​ స్పందించలేదు. తాము ఎప్పుడో జిల్లా కలెక్టర్​కు ఈ వివరాలు అందించామని.. వారిని సంప్రదించాలని సమాధానం చెప్పినట్లు తెలిసింది. మరో ఏడు రోజుల్లో సెస్​ ఆడిట్​ కూడా ఉందని విశ్వసనీయ సమాచారం. ఈ తరుణంలో రెండవ సారి చిక్కాల రామారావు సెస్​ చైర్మన్​గా పదవి బాద్యతలు స్వీకరించాక.. విజిలెన్స్​కు శాఖకు కూడా స్పందించకుండా సమాచారం ఇవ్వకుండా పెండింగ్ పెడుతూ వస్తున్న తరుణంలో అగ్నిప్రమాదం పలు అనుమానాలకు తావిస్తుంది. ఎన్నికల తరుణంలో చిక్కాల రామారావు పాలకవర్గాన్ని బదునాం చేయడానికి..ఇరుకున పెట్టేందుకు ఎవరైన ఈ కుట్రం పన్నారా..? లేదా ప్రమాదశాత్తు అయ్యిందా.. లేదా సెస్​ సిబ్బంది పాత్ర ఉందా అన్న చర్చ కొనసాగుతుంది. ప్రతి సెక్షన్​లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పాత కిటికిలు తీసేవేసి కొత్తగా స్లైడర్​ విండోలు ఏర్పాటు చేశారు. టఫాసులు ఆఫీస్​ ముందు కాల్చీన నిప్పు రవ్వలు అందులో పడే ఛాన్స్​ లేదని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే సెస్​ పాలకవర్గం ను పలు వివాదాలు చుట్టుముట్టాయి. విద్యుత్​ బిల్లుల నిర్బంధ వసూళ్లు.. దళిత కాలనీలకు విద్యుత్​ సరఫరా నిలిపివేతలతో సెస్​ పాలకవర్గం తీవ్ర విమర్శలు ఎదుర్కోంది. మంత్రి కేటీఆర్​ ఆదేశాలతో నిర్బంద విద్యుత్​ బకాయిల వసూళ్లకు స్వస్తి చెప్పి.. వాయిదాల పద్దతిలో వసూలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఈ అగ్ని ప్రమాదం తో విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు క్షేత్ర స్థాయి విచారణ జరుపుతున్నారు. సెస్​ కార్యాలయంనకు సంబంధించిన సీసీ పుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. పర్చెస్​ సెక్షన్​ ఇంచార్జీలు ఎవరు, గతంలో ఎవరు పని చేశారు.. సెస్​ లో పర్చెస్​ సెక్షన్​కు సంబంధించిన ఏం ఏం ఆరోపణలు ఉన్నాయి.. ఈ సెక్షన్​ లో సీసీ కెమెరాలు ఉన్నాయా…? లేవా..? ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగిందా..? లేదా ఏమైన కట్ర దాగి ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

రెయిన్​ కోట్స్​ కొనుగోలు చేశారు.. సిబ్బందికి పంపిణి చేయలేదు

సిరిసిల్ల సెస్​ సంస్థలో పని చేసే సిబ్బందికి ప్రతి వర్షాకాలంలో రెయిన్​ కోట్స్​ సంస్థ సొమ్ముతోనే కొనుగోలు చేసి పంపణి చేస్తారు. కానీ మొన్నటి వర్షాకాలంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన విద్యుత్​ సిబ్బందికి రెయిన్​ కోట్స్​ పంపిణి చేయలేదు. అగ్ని ప్రమాదం జరిగిన గదిలో సూమారు 300 లకు పైగా రెయిన్​ కోట్స్​ బయటపడ్డాయి. అగ్నికి సగానికి పైగా దహనమయ్యాయి. పర్చెస్​ సెక్షన్​ లో అగ్ని ప్రమాదంలో ఈ రెయిన్​ కోట్స్​ విషయం బహిర్గతమైంది. సెస్​ పాలకవర్గం లేకుండా సెస్​ అధికారుల సంరక్షణలో నడిచినప్పుడు సాఫీగా నడిచిన సెస్​ నిర్వహణ.. నూతనంగా సెస్​ ఎన్నికలు జరిగి.. చిక్కాల రామారావు రెండవ సారి చైర్మన్​గా బాధ్యతలు స్వీకరించాక సెస్​ మళ్లీ వివాదంలోకి వెళ్తుందన్న విమర్శలు వస్తున్నాయి. సిరిసిల్ల సెస్​ పాలకవర్గ పనితీరు మంత్రి కేటీఆర్​కు తలనొప్పిగా మారుతుంది. ఏది ఏమైన పోలీసులు, ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపితే కానీ ఏం విషయం తెలియదు. సెస్​ లోని సమాచారం.. పర్చెస్​ సెక్షన్​ వివరాలు కీలక ఫైళ్లు విజిలెన్స్​ అడిగిన సమాచారం మొత్తం సెస్​ పాలకవర్గం అందిస్తే ఇందులో ఏం కుట్ర కోణం లేదని తేటతెల్లమవుతుందని, ఇవే ఫైళ్లు దహనమైతే మాత్రం అనుమానాలు మిగిలిపోతాయమని సిరిసిల్లకు చెందిన ఓ నాయకుడు పేర్కొన్నారు. ప్రస్తుతం కేవలం కుట్ర కోణంలో చర్చ మాత్రమే కొనసాగుతుంది. టఫాసులతోనే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండోచ్చని సెస్​ లో ఓ అధికారి వెల్లడించారు. సిరిసిల్ల సెస్​ చైర్మన్​ చిక్కాల రామారావుపై, అప్పటి వైస్​ చైర్మన్​ గూడూరి ప్రవీణ్​ తో పాటు అప్పటి పాలకవర్గంపై కేవలం ఆరోపణలు మాత్రమేనని, కోర్టులో రుజువు కాలేదని పేర్కొంటున్నారు. ప్రతిపక్షాల కుట్రగానే భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here