బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యోరుపల్లి గ్రామానికి చెందిన నేదూరి భారత ప్రమాదవశాత్తు బావిలో పడటంతో వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. వేములవాడ ఎస్ఎఫ్ఓ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఘటన స్థానిక చేరుకుని ప్రాణాలకు తెగించి మహిళను మంచం సహాయంతో బావిలో నుంచి బయటకు తీసి వెంటనే 108 లో అస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సమావేశంలో ఎస్ ఎఫ్ ఓ అనీల్ కుమార్, లీడింగ్ ఫైర్ మన్ రాజేంద్రప్రసాద్, ఫైర్ మ్యాన్ శంకర్, ప్రేమ్ చంద్, ఉపేందర్, చంద్రశేఖర్ ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.