నిబంధనలు పాటిస్తూ ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీ

0
189

నిబంధనలు పాటిస్తూ ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీకలెక్టర్ అనురాగ్ జయంతి


సిరిసిల్ల, ఫిబ్రవరి 08, 2024

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిబంధనలు పాటిస్తూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)ల మొదటి స్థాయి తనిఖీ చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్దాపూర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యార్డ్ లో చేపడుతున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈ.వి.ఎమ్) ల మొదటి స్థాయి తనిఖీని కలెక్టర్ గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈసీ ఆదేశాల మేరకు ఈవీఎం మొదటి స్థాయి తనిఖీ పకడ్బందీ గా చేపట్టాలన్నారు.

రెవెన్యూ అదనపు కలెక్టర్, ఉప జిల్లా ఎన్నికల అధికారి ఎన్ ఖీమ్యా నాయక్ నేతృత్వంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ.వి.ఎమ్ ల మొదటి స్థాయి తనిఖీ కొనసాగుతున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here