ఇస్కాన్ వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్టులో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం..

0
53

– శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థి నితీష్ రావుకు సైకిల్ బహుమతి

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (SKTS), సిరిసిల్లకు చెందిన 9వ తరగతి విద్యార్థి ఎన్. నితీష్ రావు ఇస్కాన్ నిర్వహించిన ప్రపంచంలోనే అతిపెద్ద వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్టులో జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించి ప్రతిభ చాటారు.

జిల్లా వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో నితీష్ రావు ప్రతిభ విశేషంగా నిలిచింది. ఆయన విజయాన్ని గుర్తించి సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి మరియు ఆర్‌డీవో వెంకటేశ్వర్లు చేతుల మీదుగా సైకిల్ బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి హాజరై విద్యార్థిని అభినందించారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రాజు రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యలోనే కాకుండా నైతిక విలువల్లో కూడా మెరుగైన ప్రగతి సాధించాలని సూచించారు. నితీష్ విజయంతో పాఠశాలకు గౌరవం తీసుకువచ్చినందుకు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.

పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు నితీష్ రావును అభినందిస్తూ, తల్లిదండ్రుల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here