ఐదేళ్లు ఎంపీగా బండి సంజయ్ …కరీంనగర్ అభివృద్ధికి ఐదు కొత్తలు తీసుకురాలేదు

0
180

బలగం టీవి ,

➡️కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్

➡️చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాలలో బీఆర్ఎస్ ముఖ్యనాయకులతో సమావేశం

➡️నీళ్లు,నిధులు,నియామకాల కోసమే కోట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం

➡️కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేసేంత వరకు ఊరుకునేది లేదు

➡️2014లో ఎంపీగా ఉన్న రోజుల్లోనే కరీంనగర్ కు రైల్వే ప్రాజెక్టు తెచ్చిన

➡️కోట్లాడి కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం వెయ్యి కోట్లు తెచ్చాం

➡️కేసీఆర్ సర్కారు ఇరిగేషన్, విద్యుత్ ప్రాజెక్టుల మీదనే ఖర్చు చేసింది

➡️బీఆర్ఎస్ కార్యకర్తలందరికి కాపాడుకుంటాం

➡️కరీంనగర్ గడ్డపై పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి

కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఐదేళ్ల కాలంలో కరీంనగర్ అభివృద్ధి కోసం ఐదు కొత్తలు కూడా కేంద్రం నుంచి తీసురాలేదని, రైల్వే ప్రాజెక్టులు, నవోదయ విద్యాలయాలు కూడా తీసుకురాలేదని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు అన్నారు.

చొప్పదండి నియోజకవర్గములోని కొడిమ్యాల మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారితో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు యువతలో అలజడి, నిరాశ, నిస్పృహ ఉండేదని పేర్కొన్నారు.

తెలంగాణ రాక ముందు నీళ్లు, విద్యుత్ కోసం రైతులు ఇబ్బంది పడేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 7778 మెగావాట్లు ఉన్న విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్నీ 26వేలకు పెంచడం జరిగిందన్నారు.

తెలంగాణ రాక ముందు ఎక్కడ చూసిన రక్తపాతాలు జరిగేవని,యువకులను నక్సలైట్ల పేరుతో కాల్చి చంపేవారన్నారు. సాగునీళ్లు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారని పేర్కొన్నారు.

తెలంగాణ వస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరవేసుకోవాలని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని ,కానీ పదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ గారు తెలంగాణ లో 26వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మాణం చేశారని పేర్కొన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని, తెలంగాణ ఏర్పాటయ్యాక కాళేశ్వరం ద్వారా సాగునీళ్లు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణం చేసి వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం జరిగిందన్నారు. 1.61లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని పేర్కొన్నారు.

ఈ ఏడాది డిసెంబర్ వరకు సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని..ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నికలకు వారం రోజుల ముందుగానే రైతుబంధు కోసం ₹7700కోట్ల నిధులను సమకూర్చి పెడితే ఇప్పటి వరకు రైతులకు రైతుబంధు ఇప్పటి వరకు ఇవ్వడం లేదన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి లో అగ్రగామిగా నిలపడం జరిగిందని, బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగించడం జరిగిందన్నారు.

బీఆర్ఎస్ కార్యకర్తలందరికి పార్టీ అండగా ఉంటుందని.. కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటామని పేర్కొన్నారు.

త్వరలోనే తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ ప్రజలకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎంపీపీ స్వర్ణలత,పీఏసీఎస్ చైర్మన్ రాజనరసింగరావు, ఏఎంసీ చైర్మన్ నరేందర్, సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు కృష్ణారావు, పూడూర్ ఏఎంసీ చైర్మన్ రవిందర్ రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా కోఆర్డినేటర్ అంజనికుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పులి వెంకటేష్, నాయకులు నాగి శేఖర్, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here