- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డాక్టర్ రజిత అధ్యక్షతన మంగళవారం రోజున జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆశా (ASHA) నోడల్ సూపర్వైజర్ల సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా, డాక్టర్ రజిత ఆశా సూపర్వైజర్లకు పలు కీలక సూచనలు చేశారు. గర్భిణీ స్త్రీల నమోదును సరిగ్గా నిర్వహించాలని, అలాగే హై రిస్క్ గర్భిణీ స్త్రీలను (High-Risk Pregnant Women) త్వరగా గుర్తించి, వారికి రక్తహీనత (Anemia) లేకుండా ఎప్పటికప్పుడు చెక్-అప్‌లు చేయించాలని ఆదేశించారు. సాధారణ ప్రసవాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా గర్భిణీ స్త్రీలను ప్రోత్సహించాలని చెప్పారు. నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించాలని, లేనియెడల సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో MHN డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ అనిత, డాక్టర్ నహిమ, డెమో రాజకుమార్, సిహెచ్ఓ శాంత, బాలచంద్రం లు పాల్గొన్నారు.

