బలగం టివి:
కమిటీలో సభ్యుడిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నియామకం..
నిజాం చక్కెర ఫ్యాక్టరీ పునః ప్రారంభం పై సిఫారసులు చేసేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభించేందుకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు పరిశ్రమ ల శాఖా మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ లో సభ్యుడిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డినీ నియమిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభం పై ఈ నెల 25 న జగిత్యాల జిల్లా కేంద్రంలో పరిశ్రమల శాఖ మంత్రి అధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ నిజాం షుగర్ ఏర్పాటుతో పునః ప్రారంభిస్తే చక్కర సాగు రైతులకు రవాణా భారం తగ్గి, గిట్టుబాటు అవుతుందని, ఫ్యాక్టరీ ప్రారం చర్యలు చేపట్టాలని కోరారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభించేందుకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని నియమించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.