బలగం టివి ,రాజన్న సిరిసిల్ల
తెలంగాణ రాష్ట్ర తురక కాశ కమిటీ నూతన కార్యవర్గాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం ఏర్పాటు చేశారు. రాష్ట్ర తురక కాశ అధ్యక్షులుగా షేక్ బడెసాబ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, ఉపాధ్యక్షులుగా సయ్యద్ షరీఫ్, సయ్యేద్ జహంగీర్, షేక్ షాదుల్లా ప్రధాన కార్యదర్శి గా సయ్యద్ షరీఫ్, సహయ కార్యదర్శి సయ్యద్ అలీమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ హుస్సేన్, గౌరవ సలహాదారులుగా షేక్ చాంద్, సయ్యద్ హైదర్, సయ్యద్ మిట్టు, సయ్యేద్ జహంగీర్, ప్రచార కార్యదర్శిగా సయ్యద్ ఉమర్ కాసిం, కార్యవర్గ సభ్యులు షేక్ బీలాల్, యాదుల్, షేక్ రహీం, షేక్, అబ్దుల్ , షేక్ బాషా,లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ…. తెలంగాణ తురక కాషా కార్మిక సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమైన తెలిపారు. స్వతంత్రం వచ్చిన నాటి నుండి ప్రభుత్వాలు మారాయి కానీ తమ బతుకులు మారలేవని, ఏ ప్రభుత్వం కూడా తమవైపు కన్నెత్తి చూడడం లేదని తెలిపారు. తురక కాశీలను ఓటు బ్యాంకుకు మాత్రమే వాడుకుంటున్నారని అన్నారు.
తురాక కాశీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం కోసం పోరాటంలో తమ ఆత్మ బలిదానం ఇవ్వడానికి సిద్ధమేనని పేర్కొన్నారు. తురక కాశీల అభివృద్దే తమ ధ్యేయంగా పెట్టుకుని పని చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం లో నుంచి తురక కాశ సోదరులు భారి సంఖ్యలో హాజరయ్యారు.
