రజతోత్సవ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె..

0
149

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

బిఆర్ఎస్ పార్టీ 27వ రజతోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్‌లో జరుగనున్న బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వరంగల్ ఎల్కతుర్తిలో గురువారం రోజున చొప్పదండి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. బహిరంగ సభ ఏర్పాట్లపై కార్యకర్తలతో చర్చించారు.
ఈ సందర్భంగా సుంకె మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఓ చారిత్రక ఘట్టంగా మిగలాలన్నారు. ఊరు, వాడ దండులా కదిలి, సభను జయప్రదం చేయాలన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్ సభతో కాంగ్రెస్‌లో వెన్నులో వణుకుపుట్టాలన్నారు.
ఈ సభ కార్యక్రమంలో మండల మాజీ కోప్షన్ సభ్యులతోపాటు టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here