బలగం టివి: గంభీరావుపేట:
-హైదరాబాదులో మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక..
మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం హైదరాబాదులోని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో మృత్యుంజయం వారి అనుచరుల తో కలసి కాంగ్రెస్ లో చేరారు.గత మూడు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ నీ వీడిన మృత్యుంజయం అప్పటి బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సమక్షంలో బీజేపీ లో చేరారు, గత కొద్దీ నెలలో క్రితం బీజేపీ పార్టీ నీ విడి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లో చేరి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్ గా వ్యవహరించారు..