నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన మాజీ కౌన్సిలర్..

0
31

– మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లి మండలం, మండేపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన నక్క విజయ – కీ.శే. శంకర్ ల కుమార్తె ప్రేమల (హర్షిత్ పాల్) వివాహం సందర్భంగా స్థానిక 36వ వార్డు మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు పెద్ద మనసుతో సహాయం అందించారు.

ఈరోజు జరిగిన వివాహ వేడుకలో కల్లూరి రాజు స్వయంగా పాల్గొని 50 కిలోల బియ్యం అందజేసి నూతన వధువును ఆశీర్వదించారు. వారి శుభాకాంక్షలు తెలియజేయడంతో వధువు కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. ఈ సందర్భంగా వధువు బంధువులు కల్లూరి రాజు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్, ఎర్రం మల్లయ్య, కొక్కుల నర్సయ్య, చారీ మున్సిపల్ సిబ్బంది మరియు వధువు బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు నిరుపేద కుటుంబానికి అండగా నిలవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here