తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీశ్ రావు ప్రెస్​ మీట్​..

బలగం టీవీ, హైదరాబాద్ : 

  • మాజీ మంత్రి హరీశ్ రావు

మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పరేడ్ గ్రౌండ్ సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లాడారని,అబద్దానికి అంగీ లాగు తొడుగుతే ఎట్లుంటది అంటే అచ్చం రేవంత్ రెడ్డి లెక్క ఉంటందని బాధ్యయుతమైన పదవిలో ఉండి జవాబుదారీతనంతో నిజాలు మాట్లాడాలని అన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పై అడ్డగోలుగా మాట్లాడాడని, ఇప్పుడు అధికారంలో ఉండి అబద్దాలు మాట్లాడుతున్నడని అన్నారు. 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు మోసం చేసారని నేను గత అసెంబ్లీలో వేసిన ప్రశ్నకు సీతక్క సమాధానం ఇచ్చిన దాని ప్రకారం, 5 లక్షల వరకు మాత్రమే ఎస్ హెచ్ జీ, స్త్రీనిధి రుణం తీసుకుంటే వడ్డీ లేని రుణం అని 2015 లో అని కేసీఆర్ ప్రభుత్వం జీవో ఇచ్చిందని ఇదే విషయాన్ని అసెంబ్లీలో చెప్పారని అన్నారు. అంతకంటే ఎక్కువ తీసుకుంటే 12.5 శాతం బ్యాంకులు చార్జ్ చేస్తున్నాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెబుతున్నదని ఇచ్చిన అప్పంతా వడ్డీ లేని రుణం అంటున్నరని 21 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండానే, మొత్తం 21 వేల కోట్లు ఇచ్చినట్లు దగా చేస్తున్నడని శనివారం రోజున చేసిన ప్రచారం డొల్ల ప్రచారం, గోబెల్స్ ప్రచారమని మూడు, నాలుగు కోట్లకే వడ్డీ లేని రుణాలని మిగతా 16 వేల కోట్లకు 12 శాతం చొప్పున మహిళా సంఘాలు వడ్డీ చెల్లించాల్సింది ఉంటుందని ఎన్నికల మానిఫెస్టోలో రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు పెంచుతమన్నరని 15 నెలలు గడుస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షల పరిమితి వరకే వడ్డీ లేని రుణాలు (విఎల్ఆర్) ఉన్నవి. జీవో విడుదల చేయాలేదని అన్నారు. కనీసం నిన్న మహిళా దినోత్సవం నాడైనా పది లక్షలకు పెంచుతూ కానుకగా జీవో ఇస్తరు అనుకున్నమని కానీ, అవే అబద్దపు మాటలు, బీఆర్ఎస్ పై నిందలు తప్ప ఇచ్చిందేం లేదని అన్నారు.

రాష్ట్రంలోని మహిళలందరిని కాంగ్రెస్ మోసం చేసిందని ఈ ఆర్థిక సంవత్సరంలో నయా పైసా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడ్డీ లేని రుణం కింద విడుదల చేయలేదని మహిళా దినోత్సవం నాడు కూడా నిజం చెప్పవా రేవంత్ రెడ్డి అని, 21 వేలు కోట్లు ఇస్తే గనుక దానికి వడ్డీ 2100 కోట్లు అవుతాయని మీ అబద్దాలు వినలేక మహిళలు వెళ్లిపోయే ప్రయత్నం చేసారని మొత్తంగా మీరు చెప్పిన 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అనేది శుద్ద అబద్దమని ఒకవేళ మీరు చెప్పింది అబద్దం కాదని అనుకుంటే మీరు ఇచ్చిన 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు, చెల్లించిన వడ్డీపై లెక్కలతో సహా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

స్కూల్ యూనిఫాంలను మహిళా సంఘాలకు ఇచ్చామని డబ్బా కొడుతున్నరని స్టిచింగ్ చార్జీగా మేము జతకు 50 రూపాయలు ఇచ్చినమని 75 రూపాయలకు పెంచినమని రేవంత్ పచ్చి అబద్దం చెప్పిండని నిజానికి జతకు ఇచ్చిందని 50 రూపాయలే అని ఒక్కో విద్యార్థికి రెండు జతలు ఇస్తరని అంటే ఈ రెండు జతలకు కలిపి 50 చొప్పున ఒక్కో మహిళకు బాకీ పడ్డది నిజం కాదా? అని అన్నారు. 75 రూపాయలు ఇచ్చింది నిజం అయితే ఏ ఊళ్లో ఇచ్చినవు చూపించాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఆఖరుకు మొబైల్ ఫిష్ వ్యాన్లను కూడా తమ ఘనతగా చెప్పుకుంటున్నరని పీఎం మత్స్య సంపద యోజన కింద 60 శాతం సబ్సిడీ వస్తే, మిగతా 40 శాతం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ రుణం తీసుకుంటారని ఇందులో రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యుషన్ ఏముందని అన్నారు.

రేవంత్ ప్రమాద బీమా చెక్కుల పంపిణీ పెద్ద జోక్ గా మారిందని ప్రజా పాలన ఏడాది పూర్తియిన సందర్భంగా నవంబర్ 7, 2024న వరంగల్లో జరిగిన కార్యక్రమంలో 35 కోట్ల రూపాయల చెక్కును మహిళా సంఘానికి అందించిండని అది క్లియర్ గాక, 3 నెలల తరువాత ఆ చెక్ లాప్స్ అయ్యిందని దానికి ఇంకో 9 కోట్లు కలిపి, మళ్ళీ నిన్న 44 కోట్ల చెక్కును మహిళా సంఘాలకు ఇచ్చిండని ఇప్పుడైనా చెక్ పాసైతదా, లేదంటే ఇదే డ్రామా కంటిన్యూ అయ్యి, జూన్ రెండు కు మళ్ళీ ఇదే చెక్కు ఇస్తరా? అని ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కు డమ్మీ చెక్కు అయ్యిందని
ఇంతకంటే దివాలాకోరు రాజకీయం ఇంకోటి ఉంటదని సీఎం,డీప్యూటీ సీఎం ఇప్పటికైనా ఆ చెక్కులు పొందిన వారికి డబ్బులు వచ్చేలా చూడండని భట్టి గారంటే నాకు గౌరవం. రాజకీయాల్లో కొద్దో గొప్పో విలువలు కలిగిన నాయకుడు అనే పేరుందని, రేవంత్ రెడ్డి దుష్ట సావాసంతో, ఇప్పుడు భట్టి కూడా చెడి పోయిండని బాడీ షేమింగ్ చేయడం, అబద్దాలు మాట్లాడటంలో రేవంత్ రెడ్డితో పోటీ పడుతున్నడని నేను మీ లాగా మాట్లాడనని నా ఎత్తు గురించి మాట్లాడటం మీ విజ్ఞత కే వదిలేస్తున్నాని అన్నారు. నాకు ప్రజలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం వారి లాగా దిగజారలేనని
మహిళలను కోటిశ్వరులను చేస్తామన్నరని ముందుగా చెప్పినవి అమలు చేసి చిత్తశుద్ది నిరూపించుకోండని అన్నారు.

ఏప్రిల్ 1, 2024 నుంచి ఇప్పటి వరకు ఉన్న వడ్డీ లేని రుణం డబ్బులు వెంటనే విడుదల చేయాలని అన్నారు.
21వేల కోట్ల వడ్డీ లేని రుణం అన్నారు. ఎంత రుణం తీసుకుంటే వడ్డీ లేని రుణం ఇస్తారు జీవో సవరించి విడుదల చేయాలని అన్నారు. స్టిచ్చింగ్ చార్జీ 75 అన్నరు. తక్షణమే విడుదల చేయాలని భట్టి వెనుక ముందు చూసుకోండని
10వేల కోట్ల వడ్డీ లేని రుణాలు కూడా బీఆర్ఎస్ హయాంలో ఇవ్వలేదు అని గొంతు చించుకున్నారని ఒక్క 2022-23లోనే 13వేల కోట్లు ఇచ్చినమని మేం అధికారంలోకి వచ్చే నాటికి అప్పటి కాంగ్రెస్ 2, 3 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సెర్ప్, మెప్మా, స్త్రీనిధి ద్వారా మొత్తం లక్ష కోట్ల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చినమని అడిగేవారుండరు ఏది మాట్లాడితే అది ఉంటదా అని,నేను చెప్పిందే తప్పయితే అసెంబ్లీలో చర్చ పెట్టు అని ఏ ఏడాది ఎంత ఇచ్చినమో లెక్కలతో సహా చెబుతానని నేను ఆర్థిక మంత్రిగా పని చేసానని పచ్చి అబద్దం మాట్లాడుతున్నవని నిజాలు తెల్సుకొని మాట్లాడలని మేం ఇచ్చింది తక్కువని మీరు ఇయ్యని దాన్ని ఎక్కువ చూపడం ఇదేం చిల్లర రాజకీయమని పది వేల కోట్ల కూడా మేం ఇవ్వలేదనే శుద్ద అబద్దమని రేవంత్ రెడ్డి పాలన చేతగాక ప్రకృతి మీద కూడ నిందలు వేసిండని ఎండలకు పంటలు ఎండుతున్నయ్యటని కేసీఆర్ ఉన్నపుడు ఎండలు లేవా అని, ఎండలు మొదలు పుట్టినయా రేవంత్ ముందు పుట్టిండా అని ఈ సారి సగటు వర్షపాతం కంటే ఎక్కువ నమోదైందని.. కృష్ణా, గోదావరి పొంగి ప్రవహించాయని అన్ని రిజర్వాయర్లు నిండినయని ఇది కాలం తెచ్చిన కరువు కాదని, రేవంత్ తెచ్చిన కరువని కేసీఆర్ హయంలో ఉన్న నీళ్లు రవేంత్ రాంగనే ఎందుకు మాయం అయినయని కేసీఆర్ నీళ్లను ఒడిసి పట్టిండని రేవంత్ నీళ్లను వదిలి పెట్టిండని ఒకవైపు ఏపీ మొత్తం నీళ్లు తీసుకుపోయిందని దేవాదులో కావల్సినన్ని నీళ్లు ఉన్నయని మోటర్లు ఆన్ చేయలేదని వరంగల్ జిల్లాల్లో లక్ష ఎకరాల్లో పంట ఎండిపోతున్నదని 7 కోట్ల బిల్లులు ఇవ్వలేదని దేవాదుల వద్ద 32 రోజులు కార్మికులు సమ్మె చేసారు. 32 రోజులు నీళ్ల మోటార్లు ఆన్ చేయలేదని అన్నారు. నీళ్లు కిందికి జారి పోయినయని కేసీఆర్ నీళ్ల రాగానే మోటర్లు వేసేవారని కమిషన్ కుదరక 7 కోట్ల బిల్లు ఇవ్వలేదని కేసీఆర్ హయాంలో ఎండాకాలంలో చెరువులు మత్తల్లు దుంకెవని కాల్వలు నీళ్లతో కలకలలాడేవని ప్రకృతి వైపరీత్యం కాదు, రేవంత్ వైఫల్యం, మంత్రి వర్గ వైఫల్యం, ప్రభుత్వం వైఫల్యమని ఆ రైతులను ఆదుకోవాలి, ఎకరాకు 10 ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్
చేస్తున్నామని కేసీఆర్ నిర్మించిన సమ్మక్క సాగర్ మూడున్నర టిఎంసీ నీళ్లు ఉన్నయని కల్వకుర్తి ఎత్తిపోతల లిఫ్టులు 25 రోజులుగా ప్రారంభించ లేదని అన్నారు.

ఎవరిది పైశాచిక ఆనందం రేవంత్ రెడ్డి అని హైడ్రా ఇల్లు కూలగొట్టి నువ్వు పైశాచిక ఆనందం పొందినవని, చిన్న పిల్లలు నీళ్ల డబ్బా, పుస్తకాలు తెచ్చుకుంట అంటె టైం ఇవ్వకుండా నువ్వు పైశాచిక ఆనందం పొందినవని లగచర్ల గిరిజన రైతులకు బేడీలు వేసి పైశాచిక అనందం పొందినవని ఆశా వర్కర్లను పోలీసులతో ఎగిరెగిరి కొట్టించి పైశాచిక ఆనందం పొందినవని పేరు మర్చిపోయిండని అని అల్లు అర్జున్ ను అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందినవని అశోక నగర్ లో నిరుద్యోగులు వీపుల పగలగొట్టి పైశాచిక ఆనందం పొందినవని గుమ్మడి నరన్సయ్య నాలుగు సార్లు వస్తే అపాయింట్ ఇవ్వకుండా పైశాచిక ఆనందం పొందినవని అన్నారు.

ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిదో మాట మంత్రులదో మాట అని,గతంలో రుణమాఫీ విషయంలో సీఎం ఒక మాట, మంత్రులు ఒక మాట అని,రేవంత్ రెడ్డి సలహాలు ఇవ్వమంటాడని, మొన్న మేం ఎస్ ఎల్ బీ సీ వద్దకు వెళ్తే ఉత్తం మాకు ఎవరి సలహాలు వద్దు అంటడని 16 రోజులు అవుతున్నా 8 మంది ప్రాణాల గురించి ఈ ప్రభుత్వానికి పట్టి లేదని ఒక మంత్రి చాంబర్ లో తిరిగితే, మరొకరు చేపల పులుసు తింటున్నడని కన్వేయర్ బెల్ట్ ప్రారంభించడానికి పది రోజులు పట్టిందని ఒక్కరోజు నడిచి పోయిందది అని అన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి డైరెక్షన్ లేదు, సమన్వయం లేదని ఇరిగేషన్ చీఫ్ అనిల్ కుమార్ ఇంతవరకు అక్కడికి పోలేదని ఆయన ఎందుకు పోలేదని ఆయనకు బాధ్యత లేదా అని అన్నారు. ప్రమాద ఘటనను టూరిస్టు స్పాట్ లెక్క చేసారని పదేండ్లలో తట్టెడు మట్టి తవ్వలేదని అబద్దాలు మాట్లాడారని,ముఖం పగిలే సమాధానం చెప్పినమని అన్నారు.

కాంగ్రెస్ హాయంలో 3300 కోట్ల పని చేస్తే, బీఆర్ఎస్ పదేండ్లలో 3900 కోట్లు ఖర్చు చేసిందని అసహనం ఎక్కువైందని పాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు మేలు చరేసే ప్రయత్నం చేయి అని,నిజాయితీగా పాలించు కమిషన్లు మాను అని, కృష్ణా నది జలాలను ఏపీ తరలిస్తే, నేడు ఖమ్మం ప్రజలకు సీతారామా సాగర్ వరమైందని కృష్ణా, గోదావరి సంగమం ఇప్పటివరకు కేసీఆర్ వల్ల సాధ్యమైందని ఖమ్మం రైతాంగానికి నీరు సరఫరా అవుతున్నదని, 400 కోట్ల సన్న వడ్ల బోనస్ తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

Jeetwin

Jeetbuzz

Baji999