బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
- ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి..
- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, రైతులకు పూర్తిస్థాయిలో రైతు భరోసా, రుణ మాఫీ అమలు చేయలేదని, ఒక్క హామీ అమలు చేయకుండా కాంగ్రెస్ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.
మంగళవారం సిరిసిల్ల పట్టణ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ ఎండిఫోతున్న పంటలకు సాగునీరు వదలడానికి కేటిఆర్ కృషి చేశారని అన్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో పంటలు ఎండిపోయాయని,ఎండిపోయిన పంటల రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని,మిడ్ మానేరు నుండి మల్కపేట రిజర్వాయర్ కి 0.5 టీఎంసీ కాకుండా 1.5 టీఎంసీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్ట్ లన్ని పూర్తి చేసుకున్నామని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చివరి ఆయకట్టవరకు సాగునీటిని అందించినమని అన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు కేకే ఆచితూచి మాట్లాడాలని, రేవంత్ ఎంగిలి బిస్కెట్ లకు ఆశపడి కేకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నడని అన్నారు.కాంగ్రెస్ నాయకులు మాట్లాడే మాటలను ప్రజలు గమనిస్తున్నారని,స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు అధికార పార్టీకి కర్రు కాసి వాత పెట్టనున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పరచడానికి కృషి చేయాలని అన్నారు.