బిఆర్ఎస్ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ లో చేరిక

0
126

బలగం టివి,  తంగళ్లపల్లి

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం కస్బె కట్కూర్ గ్రామమాజీ సర్పంచ్ పొన్నం లక్ష్మణ్ గౌడ్ మరియు గౌడ సంఘం అధ్యక్షులు కార్యవర్గం మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ టోనీ, జెడ్పిటిసి పూర్మాని మంజుల లింగారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేకే
అనంతరం మాట్లాడుతూ ప్రారంభ రోజుల్లోనె పార్టీని మరింత బలేపేతం చేసి రానున్న పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు.గత ప్రభుత్వం చేసిన దోపిడీ నిర్లక్ష్యం నిర్బంధం మూలంగా ఎంతోమంది సర్పంచుల జీవితాలు అగమయ్యాయని పల్లెల అభివృద్ధికి ఆస్తులు అమ్ముకొని పనులు చేసినప్పటికీ బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.బి ఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్ లను నిర్లక్ష్యం చేసిన విధానాన్ని ఖండిస్తూ వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటూ గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్, ఆకునూరి బాలరాజు, నాయకులు శ్రీకాంత్ గౌడ్, పొన్నాల పరశురాములు, ఆరేపల్లి బాలు,శ్రీరాం గౌడ్, గంభీరావుపేట ప్రశాంత్,అల్లం సాయి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here