కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 84వ జయంతి: స్ఫూర్తి స్థల్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

0
35

బలగం టీవీ, హైదరాబాద్:

కేంద్ర మాజీ మంత్రి, మేధావి, దివంగత సూదిని జైపాల్ రెడ్డి గారి 84వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ పీవీ మార్గ్ (నెక్లెస్ రోడ్) లోని జైపాల్ రెడ్డి స్మారక స్థలమైన ‘స్ఫూర్తి స్థల్’ కు చేరుకున్న ముఖ్యమంత్రి, అక్కడ పుష్పాంజలి ఘటించి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి గారు నిబద్ధత గల రాజకీయ నాయకుడని, తన వాగ్ధాటితో పార్లమెంటులో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు కూడా జైపాల్ రెడ్డి కి ఘన నివాళులు అర్పించారు. వారిలో మంత్రులు జూపల్లి కృష్ణా రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ మరియు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి వీరితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here