బలగం టివి: రాజన్న సిరిసిల్ల:

రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన రాజకీయ కురువృద్దుడు.. సిరిసిల్ల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తౌటు కనకయ్య సోమవారం ఆనారోగ్యంతో మరణించారు. సిరిసిల్ల గ్రామపంచాయతీ హాయంలో రెండు సార్లు వార్డు మెంబర్‌గా.. మున్సిపల్ కౌన్సిలర్ గా మూడు సార్లు సిరిసిల్ల ప్రజలకు సేవలందించారు. కమ్యూనిష్ట నేతగా కార్మిక క్షేత్రంలో అనేక పోరాటలు చేశారు. పేదలకు ఇండ్ల స్థలాలు ఇప్పించడంతో తౌటు కనకయ్య కీలక పాత్ర పోశించారు. తౌటు కనకయ్య మృతదేహన్ని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు, సిరిసిల్ల పట్టణధ్యక్షులు జిందం చక్రాపాణి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి, కమ్యూనిష్టు పార్టీ నాయకులు సామల మల్లేశం, పంతం రవి, మూషం రమేశ్, డాక్టర్ రాజమల్లు, ఇతర పార్టీ నాయకులు, పట్టణ ప్రముఖులు నివాళులు అర్పించారు. తౌటు కనకయ్య కుటుంబానికి ప్రగాడ సానుభూతి ప్రకటించారు. కనకయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

