షాదిఖానా అభివృద్ధి పనులకు రూ. 80 లక్షలతో శంకుస్థాపన.

0
42

బలగం టీవీ, వేములవాడ:

వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ పట్టణంలో రూ. 80 లక్షలతో అసంపూర్తిగా ఉన్న షాదీఖానా నిర్మాణ పనులకు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో శనివారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. వేములవాడ పట్టణంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం ఇప్పటికే 150 కోట్ల రూపాయలు మంజూరు చేశామని,పనులు జరుగుతున్నాయన్నారు. అలాగే పట్టణంలో సుమారు 47 కోట్ల రూపాయలతో రోడ్డు వెడల్పు పనులు చేపట్టామని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న షాదీఖానా నిర్మాణానికి రూ.80 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులు సరిపోకపోతే అదనపు నిధులు మంజూరు చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.

అన్ని ఫంక్షన్లకు ఎంతో ఉపయోగం.. వేములవాడ లో షాదిఖానా నిర్మాణంతో ముస్లిం కుటుంబాలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఫంక్షన్ హాల్ నిర్మాణంతో ఖర్చులు ఆదా అవుతాయని వివరించారు. వాటిని మీ పిల్లల భవిష్యత్తు అవసరాలకు వినియోగించాలని సూచించారు. పిల్లలందరికీ ఉన్నత చదువులు చెప్పించాలని, వారు ఉద్యోగాలు సాదించిన తరువాత నిర్ణీత వయసు వచ్చిన వారికి పెండ్లి చేయాలని సూచించారు. పిల్లలందరూ చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని, మంచి ఉద్యోగాలు, వివిధ రంగాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు

ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ రాధాభాయ్, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here