బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
సిరిసిల్ల పట్టణంలోని శివనగర్‌లో మంగళవారం నాడు INFOCEM (Integrated Network for Community Empowerment) సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఈ ఆరోగ్య శిబిరం కార్యక్రమాన్ని INFOCEM ప్రాజెక్టు డైరెక్టర్ శాత్రవేణి మహేష్ సిరిసిల్ల నేతృత్వంలో చేపట్టారు. ఈ శిబిరంలో పాల్గొన్న సుమారు 30 మందికి హెచ్‌ఐవి (HIV) రక్త పరీక్షలతో పాటు, హెపటైటిస్–ఎ, హెపటైటిస్–బి వంటి కీలకమైన వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. పరీక్షల అనంతరం ఆరోగ్య పరిరక్షణ మరియు వ్యాధుల నివారణ పద్ధతులపై పాల్గొన్న వారికి ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఇలాంటి ఉచిత ఆరోగ్య శిబిరాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహించాలని స్థానికులు కోరారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో INFOCEM సంస్థకు చెందిన ఓఆర్‌డబ్ల్యూ శ్రీకాంత్, పీఈ శ్రీనివాసు మరియు కాలనీవాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
