బి.సి. స్టడీ సర్కిల్ లో ఉచిత IELTS శిక్షణ..

0
60

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

IELTS (ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) అనేది విదేశాలలో విద్య, ఉద్యోగం మీ ఆంగ్ల భాషా నైపుణ్యాలను అంచనా వేసే ఒక అంతర్జాతీయ పరీక్ష.

పరీక్షా విధానం:- ఈ పరీక్షలో నాలుగు విభాగాలు ఉన్నాయి: లిజనింగ్ (Listening): ఇంగ్లీష్ సంభాషణలను వినడం, రీడింగ్ (Reading): ఇంగ్లీష్ పాఠాలను చదవడం, రైటింగ్ (Writing): రెండు వ్యాసాలు రాయడం, స్పీకింగ్ (Speaking): ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం.

IELTS అకడమిక్ మరియు జనరల్ ట్రైనింగ్ అనే రెండు రకాల పరీక్షలు ఉన్నాయి.

అకడమిక్ పరీక్ష అనేది ఉన్నత విద్య కోసం ఉపయోగించబడుతుంది, అయితే జనరల్ ట్రైనింగ్ అనేది ఉద్యోగం కోసం ఉపయోగించబడుతుంది.

IELTS పరీక్ష యొక్క ఉపయోగాలు:- విదేశీ విశ్వవిద్యాలయాలలో ప్రవేశం, విదేశీ విశ్వవిద్యాలయాలలో అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో చదువుకోవడానికి IELTS అవసరం.

ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ పొందడానికి IELTS అవసరం.చదువుకోవడానికి: ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ మరియు ఇతర దేశాలకు IELTS అవసరం.ఉద్యోగం: ఆంగ్లం మాట్లాడే దేశాలలో ఉద్యోగాలు పొందడానికి ఇది సహాయపడుతుంది. IELTS లో స్కోర్ సాధించిన విద్యార్థులకు 2 సంవత్సరాల వరకు విదేశాలకు వెళ్ళడానికి అర్హత ఉంటుంది.

బి.సి. స్టడీ సర్కిల్ లో ఉచిత శిక్షణ వివరాలు..ఏదైనా డిగ్రీ/బీ.టెక్ / బీ. ఫార్మసీ పూర్తయిన విద్యార్థులు మరియు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే.హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ చే బి.సి. స్టడీ సర్కిల్ వారు ఒప్పందం చేసుకోవడం జరిగినది. నిపుణులైన faculty ద్వారా శిక్షణ ఇవ్వబడును. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి శిక్షణ ఇవ్వబడును.

  1. రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీసర్కిల్ యందు ఒక రోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేయబడును.
  2. 40 గంటలు IELTS శిక్షణ తరగతులు నిర్వహించబడును.

తేది: 11-01-2026 వరకు బిసి స్టడీ సర్కిల్ వెబ్ సైట్ www.tgbcstudycircle.cgg.gov.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని వివరాలకు 040-24071178 సంప్రదించగలరు.


జె. వెంకటస్వామి
బిసి స్టడీసర్కిల్ డైరెక్టర్.
రాజన్న సిరిసిల్ల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here