ఉచిత వైద్య శిబిరం మరియు మాదక ద్రవ్యాల నిర్మూలన ర్యాలీ..

0
104

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల నాల్గవ సంవత్సరం విద్యార్థులు జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరంలో భాగంగా 5వ రోజున ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బోయినపల్లి వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 70 మందికి పైగా మధుమేహం,రక్తపోటు కు సంబంధించిన రక్త పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్య శిబిరాన్ని గ్రామంలో ఏర్పాటు చేసినందుకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డా.కార్తీక్ , ANM వసంత, ఆశావర్కర్లు ,NSS ఆఫీసర్లు డా.అరుణ్ బాబు ,డా . మాధవి సహాయక అధ్యాపకులు డా.హిందూజా , ఆదర్శ రైతు శ్రీనివాస్ రెడ్డి,విద్యార్థులు,వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు .

సాయంత్రం గ్రామంలో ” మాదక ద్రవ్యాలు నిర్మూలన ” పై నినాదాలతో అవగాహన ర్యాలీ నిర్వహించి, యువతను మత్తులో ముంచే గంజాయి, డ్రగ్స్ అక్రమ వినియోగానికి అడ్డు కట్ట వేసేందుకు కృషి చేయాలని సూచించారు.
అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా గ్రామస్తుల ముందు విద్యార్థులు ” మహిళా సాధికారత ” యొక్క ప్రాధాన్యత తెలియచేస్తు నాటకం ప్రదర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here