రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

0
161

ఉచితంగా మందుల పంపిణీ

సిరిసిల్ల న్యూస్​:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం జగ్గరావుపల్లిలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధులకు ఉచిత వైద్య శిబిరం తో పాటు ఉచితంగా మందులను అందజేశారు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ సెక్రెటరీ ఊట్కూరి రాధాకృష్ణ మాట్లాడుతూ: రెడ్ క్రాస్ సొసైటీ వారు 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు సుదూర ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బంది పడడంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఎక్కువ శాతం 60 ఏళ్ళు పైబడిన వృద్ధుల గ్రామాలను కొన్ని ఎంపిక చేసుకొని వారికి ఉచిత వైద్య శిబిరంతోపాటు మందులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.దాదాపు వందకు పైగా వృద్ధులకు ఉచిత పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశామని అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సతీష్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది పోరెడ్డి సంజీవ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here