సిరిసిల్ల న్యూస్:
రాజన్న సిరిసిల్ల జిల్లా లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో దుమాల గ్రామంలో 103 మందికి ఉచిత బిపి షుగర్ నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది. బీపీ షుగర్ నిర్ధారణ అయినటువంటి 15 మంది కి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎల్లారెడ్డిపేట కు రిఫర్ చేయడం జరిగింది. బీపీ షుగర్ అదుపులో ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ నాయిని భాస్కర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ నెంబర్ ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, నంది కిషన్, ఇతర లయన్స్ బాధ్యులు కొలనూరి శంకర్, బోయిని మహదేవ్, పెంజర్ల రవి, వంగాల దేవయ్య, మొదలగు వారు పాల్గొన్నారు.