సిరిసిల్ల న్యూస్: తంగళ్లపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం లో బైక్ ల పై పొద్దంతా గ్రామాల్లో తిరుగుతూ రేషన్ బియ్యాన్ని తక్కువ ధరలో కొనుగోలు చేసి రైస్ మిల్లులోకి రేషన్ బియ్యం ఆక్రమా రవాణాచేస్తున్నారు. అధికారులు సైతం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని రైస్ మిల్లుల్లో రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతుంది. ఓ వైపు ఎలక్షన్ హవా నడుస్తున్న మరో వైపు జిల్లాలో రేషన్ బియ్యం దందా హవా సాగుతుంది.తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ విశ్వ సాయి రైస్ మిల్లులో ఆక్రమ రేషన్ బియ్యం దందా సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న రేషన్ బియ్యాన్ని కోనుగోలు చేసిన కొందరు అక్రమార్కులు మళ్ళీ రీసైక్లింగ్ విధానంలో రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటున్నారు.చిన్న చిన్న వాహనాల మీద ప్రభుత్వ రేషన్ బియ్యం రైస్ మిల్లులోకి రవాణా చేస్తున్నారు.రైస్ మిల్లల పై అధికారుల చర్యలు లేకపోవడంతో జిల్లాలో రేషన్ బియ్యం దందా యధేచ్చగా సాగుతుందని వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని విమర్శలు వస్తున్నాయి.