జైల్ పక్షులకు స్వేచ్చ

బలగం టివి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల:

గల్ఫ్‌‌ జైల్లో 17 ఎండ్లుగా బంధీలు

కేటిఅర్ చోరువతో ఇంటికి చేరిన బాధితులు

ఫలించిన 14 ఏండ్లు మాజీ మంత్రి కేటీఆర్‌‌ కృషి
ఎట్టకేలాకు దుబాయ్‌‌ కోర్టు క్షమాభిక్షా..
గల్ఫ్‌‌ బాధిత కుటుంబాల్లో ఆనందం..
• మాజి మంత్రి కేటీఆర్‌‌కు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబాలు

పేదరికం తో కోట్టుమిట్టాడుతూ,ఉన్న ఊరిలో ఉపాధి లేక పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ వెళ్లి నాలుగు రాళ్లు సంపాదించి కుటుంబ కష్టాలు తిరుద్దామని అప్పులు చేసి గల్ప్ వెళ్లిన సిరిసిల్ల వాసులు బతుకుల ఆశలను ఓ హత్య సమాధి చేసింది. అప్పటికే అందరిని అప్పటికే అందరిని వదిలి పరాయి దేశాలకు వెళ్లిన వలస జీవులలు హత్య కేసులో ఇరుక్కోవడంతో కష్టాలు ఆ కుటుంబలను చుట్టుముట్టాయి. ఉన్న ఊరిని, అయిన వారిని వదిలి పెట్టి ఎడారి దేశాలకు ప్రయాణమైన బిడ్డలు జైలో ఉండంతో ,వారి కుటంబల కీ తిండి తిప్పలు లేక కంటి మీద కునుకులేకుండా పోయింది. ఉన్న ఊరికి వచ్చి కన్నోళ్లను, కట్టుకున్న వారిని చుస్తామె లేదో కళ్లు కాయలు కాసేలా ఆశతో ఎదురు చూసిన అ వలస పక్షులకు స్వేచ్చ లభించింది. 14 సంవత్సరాలుగా బీఆర్ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌‌ రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులను దుబాయ్‌‌ జైలు నుంచి విడుదల చేయించడానికి చేసిన కృషి ఎట్టకేలాకు ఫలించింది. ఇప్పటికే కేటీఆర్‌‌ ఈ కేసులో వ్యక్తిగతంగా సూమారు రూ.30 లక్షల వరకు వెచ్చించి.. గల్ప్‌‌ బాదితులను జైలు నుంచి విముక్తి కోసం న్యాయ సహయం చేశాడు. ఈ కేసులో 17 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురిలో ఇప్పటికే ఇద్దరు విడుదల అయ్యారు. పెద్దూర్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు ఇద్దరు శివరాత్రి మల్లేశం, రవి బుధవారం దుబాయ్ జైలు నుంచి విడుదల అయ్యి స్వగ్రామం చేరుకున్నారు. కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. శంషాబాద్‌‌ ఎయిర్‌‌ పోర్టులో పెద్దూరు గల్ప్‌‌ బాధిత కుటుంబ సభ్యుల రోదనతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాతోపాటు జగిత్యాల జిల్లాలకు చెందిన మొత్తం ఐదుగురు వలసజీవులు 17 ఏళ్లుగా దుబాయ్ జైలులో బందీలుగా ఉన్నారు.ఓ హత్య కేసులో 25 ఏండ్ల జైలు శిక్షకు గురయ్యారు. తెలంగాణ ప్రభుత్వం, మాజీ మంత్రి కేటీఆర్‌‌ న్యాయ సహాయంతో దుబాయ్ ప్రభుత్వం వారి కి క్షమాభిక్ష ప్రసాదించడంతో బుదవారం వరకు నలుగురు ఇంటి కి చేరుకున్నారు. మరోకరు ఈ నెలకారులో రానున్నాడు.
అసలు ఎం జరిగింది..
రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం (48), శివరాత్రి రవి (45) అన్నదమ్ములు, ఊరులో సరైన ఉపాధిలేక 2004లో అప్పులు చేసి బతుకుదెరువుకోసం దుబాయ్ కి వెళ్లారు. వీరితో పాటు కోనరావుపేటకు చెందిన దండుగుల లక్ష్మణ్ (48), చందుర్తికి చెందిన నాంపల్లి వెంకటి (43), జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు(51) దుబాయ్ కి వెళ్లారు. మొదట ఓ కంపెనీలో చేరి పనిబాగా లేదని బయటకు పారిపోయి ఇతర చోట్ల పనిచేసుకునే వారు. ఈ నేపథ్యంలో నేపాల్ కి చెందిన దిల్ బహ దూర్ అనే సెక్యూరిటీ గార్డు 2005లో హత్యకు గుర య్యాడు. ఈ హత్యను వీరే చేశారని అక్కడి పోలీ సులు అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.

పరిహారమిచ్చినా దక్కని క్షమాభిక్ష..

దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురైన నేపాలీ సెక్యూరిటీ గార్డు దిల్ బహదూర్ కుటుంబ సభ్యు లకు నిందితులు బ్లడ్ మనీ (పరిహారం) చెల్లించిన పక్షంలో బాధిత కుటుంబం క్షమాభిక్ష పెడితే కోర్టు విధించిన శిక్షను రద్దు చేస్తారు. ఈ నేపథ్యంలో నేపాల్లోని దిల్ బహదూర్ భార్య రూ.15 లక్షలు చెల్లిస్తే క్షమాభిక్ష పెడతానని అంగీకరించింది. అయితే అంత డబ్బు చెల్లించే స్థోమత లేక జైల్లో ఉన్నవారి కుటుంబ సభ్యులు 2012 నవంబర్లో రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. తమ కిడ్నీలు అమ్ముకొని నేపాల్లోని బాధిత కుటుంబానికి పరిహారం చెల్లిస్తామని, అందుకు అనుమతించాలని కోరుతూ దరఖాస్తు చేసుకు న్నారు. ఈ విషయం అప్పట్లో పత్రికల్లో రావడంతో బాధితులకు ఆర్థికసాయం అందించేందుకు అప్పటి రాష్ట్ర ఐటీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే ,కేటీఆర్ ముందుకొచ్చారు. 2012లో ఆయన స్వయంగా నేపాల్ వెళ్లి రూ.15 లక్షల పరి హారాన్ని బహదూర్ కుటుంబ సభ్యులకు అందిం చారు. దాంతో మృతుడి భార్య క్షమాభిక్ష పత్రంపై సంతకం చేశారు. ఈ మేరకు సంబంధిత పత్రాలను దుబాయ్ కోర్టుకు సమర్పించారు. కాగా వీరిపై తీవ్ర నేరారోపణలు ఉండడంతో బందీలుగా ఉన్నవారి విడుదలకు కోర్టు నిరాకరించింది. ఈ ఐదుగురిని విడిపించేందుకు మాజి మంత్రి కె.తారక రామారావు అప్పటి విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్తోనూ చర్చించారు. వీరి కోసం ఆయన దుబాయ్ కూడా వెళ్లారు. కానీ మన రాయబార కార్యాలయం దుబాయ్ లోని ముఖ్య అధికారులతో దౌత్యపరమైన చర్చలు జరగపకపో వడంతో వారు ఇన్ని రోజులు జైల్లోనే ఉన్నారు.. దీంతో 17 ఏళ్లుగా దుబాయ్ జైలులోనే ఉన్నారు.

ఫలించిన కేటీఆర్‌‌ కృషి..17ఏండ్ల తర్వాత .. క్షమాభిక్ష విడుదల..
దుబాయ్‌‌ జైల్లో 17సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులకు మాజీ మంత్రి కేటీఆర్‌‌ న్యాయ సహాయం చేస్తున్నారు. హత్యకు గురైన నేపాల్‌‌ వాసి కుటుంబానికి పరిహారం కింద కేటీఆర్‌‌ రూ.15 లక్షలు చెల్లించాడు. న్యాయం సహాయం కోసం సోంతంగా రూ.15 లక్షల వరకు ఖర్చు పెట్టారు. వీరి విడుదల కోసం దుబాయ్‌‌ లాయర్ అనురాధ తో పాటు మంద భీంరెడ్డి, నారయణ స్వామి, చిట్టిబాబు, మాజీ పీఎస్‌‌ శ్రీనివాస్‌‌, గుండెల్లి నర్సింహా, జువ్వాడి శ్రీనివాస రావు,పీచర కిరణ్‌‌ కుమార్‌‌, జర్నలిస్టులు నాగభూషణం, బాలు కాయితి, శ్రీనివాస రావు, రాధారపు సత్యం, ఆశోక్‌‌ రెడ్డి లతో పాటు మరి కొందరు సహకరించారు. ఎట్టకేలాకు 17 ఏళ్ల అనంతరం దుబాయ్‌‌ కోర్టు కనికరించి వీరికి క్షమాభిక్ష పెట్టడంతో ఈ నెల 21న విడుదలయి ఇంటికి చేరుకున్నారు,వీరు స్వదేశం రావడానికి విమాన టికెట్లు కూడా కేటీఆర్‌‌ అందించారు.
బాధత కుటంబాలో సంతోషం..
దుబయ్ ప్రభుత్వం క్షమాభిక్షా పేట్టడంతో 17 ఎళ్లు తర్వాత శివరాత్రి మల్లేశం,రవి లు బుదవారం స్వదేశంనికి వచ్చారు. . వీరి కుటుంబ సభ్యులను ఎయిర్‌‌ పోర్టుకు తీసుకవేళ్లడానికి కేటీఆర్‌‌ పత్యేక వాహనం ఏర్పాట చేసి కుటంబసభ్యలను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి తీసుకవేళ్లారు. శంషాబాద్ లో ఏర్పోర్ట్ లో బాధితులను కుటుంబ సభ్యులు చూడగానే కన్నీటి పర్వతం అయ్యారు. స్వగ్రహం పెద్దూరికి రావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకోంది. బాధితులను చూడగానే తల్లిదండ్రులు, భావోద్వేగానికి లోనయ్యారు.. 17 ఏళ్ల తర్వాత ఇంటికి రావడంలో ఆ కుటుంబంల లో ఆనందం నెలకొంది.. 17 ఏళ్ల తర్వాత వచ్చిన బాధితులను మిత్రులు బంధువులు యోగక్షేమాలను అడిగి తెలిసుకున్నారు. గల్ప్‌‌ బాధిత కుటుంబాలు మాజీ మంత్రి కేటీఆర్‌‌కు కృతజ్ఞతలు తెలిపారు

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

Jeetwin

Jeetbuzz

Baji999

sekabet girişSekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabetSekabet GirişSekabet Güncel Giriş sekabet giriş Sekabet Sekabet Sekabet Giriş Sekabet Güncel Giriş Sekabet Sekabet Sekabet Giriş Sekabet Güncel Giriş