–జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి
బలగం టివి,సిరిసిల్ల:
క్రిడలు మానసికి ఉల్లాసాన్ని పెంపోందించడమే కాక ,స్నేహా భావాన్ని పెంపోందిసాయని జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు.అదివారం సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యాంకర్స్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ లో గెలిపోందిన విజేతలకు బహుమతులు ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి హాజరై విజేతగా నిలిచిన యూనియన్ బ్యాంక్ జట్టుకు ట్రోఫీతో పాటు రూ.5,000, రన్నరప్ జట్టుకు ట్రోపితో పాటు రూ.2,500 నగదు బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్బంగా జడ్పి చైర్మన్ మాట్లాడుతూ బ్యాంకర్స్ వారు ఉద్యోగ బాధ్యతలే కాకుండా , ఉల్లాసం కొరకు ఆటలు అడలన్నారు. యువత చెడు వ్యసనాల బారిన పడి బంగారులాంటి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. గంజాయి, మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లితండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయవద్దని కోరారు. క్రీడల్లో యువత జాతీయ స్థాయిలో రాణించాలని ,ఆటల్లో గెలుపు ఓటములు సహజమని, స్నేహపూరిత భావంతో క్రీడాకారులు మెదలాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, కౌన్సిలర్స్, నిర్వాహకులు, బ్యాంకర్స్, ఆటగాళ్ళు పాల్గొన్నారు